Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీ అనంతరం నుంచి విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రానికి మరింత కసరత్తులు చేస్తున్నాడు విజయ్. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్, వీరి పేరెంట్స్ అందరు కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు.
అమెరికాలో విజయ్ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే విజయ్ అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్మించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో అక్కడ తెలుగు ప్రేక్షకులు విజయ్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. రౌడీతో సెల్ఫీల కోసం ఎగబడ్డ వీడియోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన పలువురు.. మనోడు క్రేజ్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.