RRR: ఆస్కార్ కు మరింత దగ్గరగా

=టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఘనతలను సాధించింది. ఫైనల్ గా ఆస్కార్ ను పొందడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది. అవార్డులు కూడా వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ ఇది వరకే, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్, హాలీవుడ్ క్రిటిక్ అసోషియేషన్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్, అంటార్కిటిక్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి అవార్డులను గెలుచుకుంది. తాజాగా అందరు ఎదురుచూస్తున్న ఆస్కార్ కు మరింత దగ్గరకు వెళ్లింది. తాజాగా ఆస్కార్ విడుదల చేసిన షార్ట్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ పేరు కనిపించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఎంపికైంది.

ఊరమాస్ సాంగ్ నాటు నాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. ఈ ఎనర్జిటింగ్ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అలాగే ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు