RRR : మరో అంతర్జాతీయ పురస్కారం

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడలైంది. రూ.550 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం రూ. 1200 కోట్ల వసూళ్లు చేసి సంచలనాన్ని సృష్టించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది.

ఓటీటీలో కూడా ఆర్ఆర్ఆర్ అనేక రికార్డులను క్రియేట్ చేసింది. చాలా వారాల పాటు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో రామ్ చరణ్, తారక్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అలాగే భారతదేశంలో రెండు సార్లు రూ. 1000 కోట్ల మార్క్ అందుకున్న డైరెక్టర్ జక్కన్న రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నాడు.

తాజాగా ఆర్ఆర్ఆర్ మరో అరుదైన ఘనతను సాధించింది. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్ సీ ఎ స్పాటిలైట్ అవార్డును ఆర్ఆర్ఆర్ అందుకుంది. దీంతో పాటు ఆర్ఆర్ఆర్ కు ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డును అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అందించింది. ఇలా ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం పై తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అవార్డులు రావడం వల్ల ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ మరింత దగ్గరకు వెళ్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు