RuhaniSharma : అన్నీ దెబ్బేసాయి.. ఇక ఈ అమ్మడి ఆశలన్నీ అల్లరోడిపైనే!

Ruhani Sharma : టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల కింద సుశాంత్ తో కలిసి తొలి సినిమా ‘చిల‌సౌ’ లో నటించగా, ఫస్ట్ సినిమాతోనే ట్యాలెంటెడ్ బ్యూటీ అనిపించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. రొటీన్ కి భిన్నంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం ఈ అమ్మడికి ఒక రకంగా ప్లస్ అయింది. అందుకే పలు సినిమాలు ప్లాప్ అయినా ఈ అమ్మడి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ భామకి టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదు. అప్పుడెప్పుడో హిట్ ది ఫస్ట్ కేస్ ఓ మోస్తరు విజయం లభించింది. ఆ తర్వాత రుహాని శర్మ నటించిన హర్, నూటొక్క జిల్లాల అందగాడు, డర్టీ హరి, సైంధ‌వ్, ఆప‌రేష‌న్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ లాంటి సినిమాలలో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు.

Ruhani Sharma is the heroine in Allari Naresh's new movie

అల్లరోడి సినిమాపైనే అమ్మడి ఆశలు…

అయితే రుహని శర్మ రీసెంట్ గా నటించిన ఐదారు సినిమాలు ప్లాప్ అయినా ఈ అమ్మడికి నటన పరంగా రిమార్క్ రాలేదు. మంచి పత్రాలు చేయడం వల్ల అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను లేటెస్ట్ గా పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. ఫ్యామిలీ డ్రామా అనే చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత – దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇది హీరోయిన్ రోల్ లా కాకుండా సినిమాకి కీలకమైన పాత్ర అని కూడా సమాచారం. ఇక మరో వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించనుండగా, జిజు సన్నీ కెమెరా, రామకృష్ణ అర్రం ఎడిటర్ గా, విశాల్ అబానీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ఫోటోషూట్లతో రచ్చ…

ఇక రుహని శర్మ సినిమాలతో ప్లాప్ అందుకుంటున్నా ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది. నార్త్ అమ్మాయి అయినప్పటికీ నెట్టింట ఎక్కువగా సౌత్ కల్చర్ కి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మాయికి టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు వచ్చినా అవకాశాలు వస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. మరి అల్లరోడి సినిమాతో అయినా ఈ భామకు మంచి హిట్ దక్కుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు