Rukmini Vasanth: విజయ్ దేవరకొండ తో ఆ సినిమా మిస్ అయిన మరో సినిమా పట్టుకుంది

Rukmini Vasanth: ఫిలిం ఇండస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క హిట్ సినిమా పడితే ఏ నటీనటులకైనా కూడా వరుసగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే కన్నడలో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా పార్ట్ A , పార్ట్ B అంటూ రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఇకపోతే పార్ట్ A చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా అసలు నచ్చలేదు. మరి ఇంత సాడ్ గా ఉంది ఏంటి అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అని కొంతమంది చెబుతూ ఉంటారు.

ఇకపోతే సప్త సాగరాలు దాటి సినిమాలో హీరోయిన్ గా కనిపించింది రుక్మిణి వసంత్. ఈ సినిమాతోనే రుక్మిణి వసంత్ మంచి పేరు సాధించుకుంది. ప్రస్తుతం రుక్మిణికి వరుసగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. తమిళ్ లో కూడా చాలా సినిమాలు సైన్ చేస్తూ కెరియర్ లో ముందుకు వెళుతుంది. ఇక తెలుగులో కూడా విజయ్ దేవరకొండ సరసన గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ 12వ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది అని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో భాగ్యశ్రీ నటించడంతో రుక్మిణి నటించిన లేదు అనే క్లారిటీ చాలామందికి వచ్చేసింది.

Rukmini Vasanth

- Advertisement -

ఇక రుక్మిణి విజయ్ దేవరకొండ తో మరో సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించబోయే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి కనిపిస్తుంది అని తెలుస్తుంది. ఇకపోతే విజయ్ హిట్ సినిమాలు చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్ తర్వాత విజయ్ రెండు సినిమాలు చేశాడు ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం విజయ్ సైన్ చేసిన మూడు ప్రాజెక్ట్స్ పై కూడా మంచి బజ్ ఉంది. గౌతం తిన్ననూరి, రాహుల్, రవి కిరణ్ కోలా దర్శకులుగా వీళ్ళు ముగ్గురు వాళ్ళ సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటివరకు వీళ్ళ నుంచి డిజాస్టర్ వర్క్ అయితే రాలేదు. అందుకోసమే విజయ్ తో చేసే సినిమాని వీళ్ళు ముగ్గురు బాగా ప్లాన్ చేసి ఉంటారు ఇక అన్ని వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని రౌడీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు