Rush : యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న అండర్రేటెడ్ డైరెక్టర్.. కం బ్యాక్ ఇస్తాడా?

Rush : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ అండర్రేటెడ్ డైరెక్టర్లలో “రవిబాబు” ఒకరు. ఈయన దర్శకుడు కాకముందే ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడిగా, ఒక విలక్షణ నటుడుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే దర్శకుడుగా తెలుగులో చాలా డిఫరెంట్ సినిమాలు తీసి మెప్పించాడు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని తెలిసిందే. తన దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, అవును, లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమాలతో రవిబాబు తనలోని అద్భుతమైన దర్శకుడ్ని ఆవిష్కరించాడు. అయితే రవిబాబు గత కొన్నాళ్లుగా సరైన సినిమాలు అందించలేకపోతున్న విషయం తెలిసిందే. వరుస ప్లాప్ లు అందుకున్న రవిబాబు ఇటీవల కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఓ ఓటీటీ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు.

Rush movie produced by director Ravi Babu will be streaming on ETV Win OTT

రష్ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు..

ఇక రవిబాబు తాజాగా తాను నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన‌ సినిమా ‘రష్’ (Rush). సతీశ్ పోలోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. అయితే రవిబాబు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, ట్రైలర్ చూస్తుంటే రవిబాబు సినిమాలాగే ఉంది. ఇక ఈ సినిమాలో ‘డైసీ బోపన్న’ మెయిన్ లీడ్ లో నటించింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ ‘రష్’ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కాగా యూట్యూబ్ లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 13 నుండి ఈటివి అప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ట్రైలర్ లో ఒక సాధార‌ణ గృహిణికి కొన్ని అనుకోని ప‌రిస్థితులు ఎదురైతే ఆమె వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొంది అనే ఆసక్తికర కథాంశంతో యాక్ష‌న్ సినిమాగా ఈ రష్ ని తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో ఓ సోష‌ల్ ఇష్యూ గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రష్ సినిమా ఈటీవి విన్ ఓటీటీలో దూసుకుపోతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే రష్ చూసేయొచ్చు.

- Advertisement -

అసలైన కం బ్యాక్ ఎప్పుడిస్తాడు..?

అయితే రవిబాబు సినిమాలు చూసిన వారికి అతనితోనే దర్శకత్వ ప్రతిభ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది హారర్ థ్రిల్లర్స్, సైకో త్రిల్లర్స్ తీస్తున్నారు, కానీ ఒకప్పుడు రవిబాబు తీసిన అనసూయ, అమరావతి వంటి చిత్రాలు చూస్తే, రవిబాబులోని ఇంత టాలెంట్ ఉందా అని అంటారు. ముఖ్యంగా అనసూయ లో గులాబీ పూవు గోవింద్ గా నటించి ప్రేక్షకుల్ని భయపెట్టిన తీరు చూస్తే, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎవరూ తీయలేరనిపిస్తుంది. ఏది ఏమైనా ఆనాటి రవిబాబు కోసం తెలుగు సిన్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక రవిబాబు ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించడం తగ్గించాడు. ఎప్పటికైనా దర్శకుడిగా రవిబాబు మంచి కం బ్యాక్ ఇస్తారని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు