S.S.Rajamouli : అతడు రూ.1000 కోట్లు ఇచ్చినా అక్కర్లేదు.. ఎందుకింత పంతం జక్కన్న..?

S.S.Rajamouli.. సింహాద్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి.. అంతకుముందు శాంతినివాసం సీరియల్ కు ఎపిసోడ్ డైరెక్టర్ గా పనిచేసేవారు.. ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసి తెలుగు సినిమా ఖ్యాతిని గర్వంగా ఎల్లలు దాటించిన గొప్ప వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ముఖ్యంగా బాహుబలి సీరీస్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అడ్వెంచర్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు..

S.S.Rajamouli: Even if he gives Rs.1000 crores, he doesn't want it.. Why is he betting so much..?
S.S.Rajamouli: Even if he gives Rs.1000 crores, he doesn’t want it.. Why is he betting so much..?

మగధీర విషయంలో టెన్షన్ పడ్డ రాజమౌళి..

రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అంతేకాదు అందులో నటించిన హీరోలకి కూడా మంచి పేరు లభించింది.. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో తీయబోయే సినిమా.. తెరపై ఇంతవరకు ఎవరు చూడని బిగ్ అడ్వెంచర్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఎలాంటి కథనైనా సరే అవలీలగా తెరకెక్కించగలిగిన రాజమౌళి మగధీర సినిమా తీసేటప్పుడు మాత్రం టెన్షన్ పడ్డారట . అప్పటివరకు తెలుగులో అంత భారీ బడ్జెట్ ఏది రాలేదు. ఆయనపై నమ్మకంతో నిర్మాతలు కూడా ముందుకు రావడంతో సినిమాను తీశారు . అయితే ఈ సినిమా చేసే సమయంలో రాజమౌళికి ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చవుతుంది..? ప్రొడక్షన్ టీం కి ఎంత అవుతుంది? ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి..? అనే విషయాలు తెలుసుకున్నారట. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయనే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం..

హీరోయిన్ నచ్చకపోతే నిర్మాత రూ.1000 కోట్లు ఇచ్చిన నో..

ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ఎంపిక విషయంలో రాజమౌళి మాట్లాడుతూ.. ఒక హీరోయిన్ అనుకుని కథ రాసినప్పుడు.. ఆ హీరోయిన్ నే నేను సినిమాలలో తీసుకుంటాను.. అంతకుముందు ఆమెకు పది సినిమాలు ఫ్లాప్ లు వచ్చినా సరే.. నేను చూడను.. కథకు సరిగ్గా సరిపోతుందా? లేదా? అని మాత్రమే చూసుకుంటాను.. ఒకవేళ కథకు సరిపోరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎంపిక చేసుకోను.. అందుకు నిర్మాత రూ .1000 కోట్లు ఇచ్చినా సరే.. నిర్మొహమాటంగా నేను తిరస్కరిస్తాను అంటూ తెలిపారు రాజమౌళి..

- Advertisement -

అందుకే అంత పంతం..

ఎవరైనా నిర్మాత ఫలానా హీరోయిన్ తీసుకుందామని సూచించినా సరే కథకు సరిపోకపోతే నేను తీసుకోను అని స్పష్టం చేశారు.. ఇక మగధీర సినిమాతో తాను ఎంతో నేర్చుకున్నాను అని.. పౌరాణిక ,జానపద చిత్రాలు కూడా చేయగలను అనే నమ్మకాన్ని యమదొంగ సినిమా కలిగించింది అని తెలిపారు.. ప్రస్తుతం రాజమౌళి మగధీర, యమదొంగ సినిమాలకు సంబంధించి.. ఆ సినిమాలలో హీరోయిన్ల గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చారు… మొత్తానికి అయితే తన సినిమాలోని హీరో, హీరోయిన్లు ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ..

రాజమౌళి పై ప్రశంసలు..

ఇంత నిక్కచ్చితంగా పనిచేస్తాడు కాబట్టే రాజమౌళి నేడు అంతర్జాతీయంగా పేరు దక్కించుకున్నారు అని ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం… ఏది ఏమైనా రాజమౌళి తెరకెక్కించినట్టు ఇప్పటివరకు ఎవరు అంత అద్భుతంగా సినిమాను తీయలేదు అనడంలో అతిశయోక్తి కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు