S S Rajamouli: రాజమౌళి చెప్పిన కథను రిజక్ట్ చేసిన ప్రభాస్

S S Rajamouli: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఎస్.ఎస్ రాజమౌళి తీసిన సినిమా ఏది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచలేదు. ఎన్ని అంచనాలతో సినిమాకు వెళ్లినా కూడా వాటన్నిటిని మించి రాజమౌళి సినిమా ఉంటుంది. వరల్డ్ సినిమాలో ఒక ఫెయిల్యూర్ కూడా లేని ఏకైక దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు.

ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచం అంతటా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కూడా ఈ సినిమాలో ఒక సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. అయితే రాజమౌళితో పని చేయాలని చాలామంది ఆశపడుతుంటారు. కానీ ఒక హీరో మాత్రం రాజమౌళి చెప్పిన కథను రిజెక్ట్ చేశాడట. అతను మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

 Simhadri Movie

- Advertisement -

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా సింహాద్రి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ఎన్టీఆర్ కు ఒక స్టార్ డం తీసుకొచ్చింది. ఇదే సినిమాను ప్రభాస్తో చేయాలని అనుకున్నాడు. కథ కూడా ప్రభాస్ కి చెప్పారట. కానీ ప్రభాస్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఈ సినిమా ప్రివ్యూ కి మాత్రం ప్రభాస్ హాజరయ్యాడు అప్పుడు కూడా రాజమౌళి ప్రభాస్ తో చాలా అద్భుతంగా మాట్లాడారు అని చెప్పుకొచ్చారు. మొత్తానికి అలా ప్రభాస్ వదిలేసిన సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు