S.Shankar: కాజల్ ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన డైరెక్టర్.. ఎంత పని చేసావయ్యా..?

S.Shankar.. రోబో చిత్రాలతో లైమ్ లైట్ లోకి వచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం ఈయన తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తూనే.. మరొకవైపు కమలహాసన్ తో ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నారు.. ఒకేసారి రెండు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ రెండు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.. అయితే ముందుగా కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా జూలై 12వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ అభిమానులే కాదు కాజల్ అగర్వాల్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇందుకు కారణం ఈ సినిమాలో కాజల్ కీలకపాత్ర పోషిస్తోందని వార్తలు వెలువడమే..

చెన్నైలో ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్..

S.Shankar: The director who made Kajal fans heart.. how much work did you do..?
S.Shankar: The director who made Kajal fans heart.. how much work did you do..?

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇక అందులో భాగంగానే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇండియన్ 2 ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మూవీ టీం తో పాటు పలువురు స్టార్స్ సందడి చేశారు.. అయితే ఈ వేడుకలలో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్లు మాత్రం కాజల్ అభిమానులకు నిరాశను మిగిల్చాయి.. ఇండియన్ 2 చిత్రంలో కాజల్, సిద్దార్థ్ , రకుల్ ప్రీతి సింగ్ కీలకపాత్రను పోషించారు.

కాజల్ ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన డైరెక్టర్ శంకర్..

తాజాగా కాజల్ పాత్ర గురించి మాట్లాడుతూ.. కాజల్ ఈ సినిమాలో కాకుండా ఇండియన్ 3 లో ఆమె పాత్ర చేసిన సన్నివేశాలు ఉంటాయని తెలిపారు డైరెక్టర్ శంకర్ . దీంతో కాజల్ అభిమానులు హర్ట్ అయ్యారు.. ఎందుకంటే పెళ్లి , పిల్లలు అంటూ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ఇప్పుడు మొదటిసారి కమలహాసన్ తో కనిపించనుంది.. పైగా ఇండియన్ 2 సినిమాలో కాజల్ ను చూసేందుకు కాజల్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో కాజల్ సన్నివేశాలు ఉండవని తెలిసేసరికి ఆమె అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారని చెప్పాలి.. డైరెక్టర్ శంకర్ చెప్పిన ఈ మాట అభిమానులను పూర్తిస్థాయిలో హర్ట్ చేస్తోంది. మరి కాజల్ అగర్వాల్ అభిమానులు ఈ సినిమాను చూడడానికి వస్తారా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఇండియన్ 2 తారాగణం..

ఇదిలా ఉండగా మరోవైపు ఈ చిత్రంలో వివేక్, ఎస్ జే సూర్య , బాబీ సింహ, ప్రియా భవాని శంకర్ , సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు..ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు ..ఇక మరోవైపు కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సినిమా కూడా జూన్ 7వ తేదీన రిలీజ్ కానుంది.. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇంకోవైపు శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.. ఈ సినిమాను దసరా కానుక విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు