Sadaa: టైట్ డ్రెస్ లో సదా రచ్చ మాములుగా లేదుగా !

Sadaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది చాన్సులు దొరక్క… పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకోకుండా… ఇండస్ట్రీలోనే అడపా దడపా సినిమాలు చేసి రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో సదా ఒకరు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తేజ దర్శకత్వంలో జయం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సదా. దీంతో అప్పటినుంచి హీరోయిన్ సదా ఏ సినిమా చేసిన బంపర్ హిట్ అవుతూనే ఉంది. తనదైన నరంతో ఆకట్టుకున్న సదా ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలలో ఛాన్స్ కొట్టేసి బంపర్ విజయాలను అందుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే తమిళంలో విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ నటికీ తమిళ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దానితో చాలా సంవత్సరాల పాటు సదా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగించింది.

- Advertisement -

అయితే నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సదా. ఈ క్రమంలో తమిళ హీరో మాధవన్ తో అప్పట్లో ప్రేమాయణం నడిపించిందట. దాదాపు అతన్ని నాలుగు సంవత్సరాలు ప్రేమించిందట. ప్రియసఖి, నాన్ అవనాలు సినిమాలలో వీరిద్దరూ నటించారు. ఈ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట.

అయితే తాజాగా హీరోయిన్ సదా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. టైట్ గా ఉన్న బ్లాక్ డ్రెస్ వేసుకొని…. మెడలో గొలుసు ధరించి రచ్చ చేసింది హీరోయిన్ సదా. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ సదాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు