Sai Dharam Tej.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. మెగా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, శుభకార్యాలు జరిగినా అందరూ కూడా ఒకే చోట కలిసిపోతూ ఉంటారు.. పొలిటికల్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపుగా పదేళ్లకు పైగా అవుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు గెలవలేదు.. కానీ 2024 ఎన్నికలలో అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి 21 మంది పోటీ చేయగా.. 21 మంది గెలిచారు. దీంతో అటు జనసేన కార్యకర్తలకు ఇటు మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.
మేనమామ పై సాయి ధరమ్ తేజ్ ప్రేమ..
ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి కూడా మెగా కుటుంబ సభ్యులు అందరూ తరలివచ్చారు. మెగా మేనల్లుడు గా పేరుపొందిన సాయి ధరంతేజ్ కూడా తాజాగా తన ట్విట్టర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం వీడియోని షేర్ చేస్తూ.. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ వీడియోని క్షణాలలో వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఒక్క పోస్టుతో సాయిధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్వీకారోత్సవంలో అకీరా హైలెట్..
ఈ ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించారు అకీరా. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గెలుపు ఈరోజు వరించింది.. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని వాగ్దానాలను నెరవేర్చి..2029 ఎన్నికల బరిలోకి దిగుతానంటూ కూడా తెలియజేశారు.. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కమ్మ, కాపు నేతలు సైతం పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడడానికే మక్కువ పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆ కోరికను కూడా తీరుస్తారేమో చూడాలి మరి.
కుటుంబ సమేతంగా విచ్చేసారు..
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కూడా రావడం జరిగింది.. అలాగే రామ్ చరణ్ కూడా ఇక్కడ కనిపించారు. ముఖ్యంగా చిరంజీవి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెలువడ్డాయి.. ప్రమాణస్వీకారం పూర్తి అయిన తర్వాత మోడీతో కలిసి..ఆయనను అన్నదమ్ములు ఇద్దరూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆప్యాయతగా మాట్లాడించడం జరిగింది. ఓకే ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోదీ కనిపించి అందరిని ఆశ్చర్యపరచడమే కాదు ఆనంద భాష్పాలకు గురి చేశారు. మొత్తానికి అయితే సాయి ధరంతేజ్ తన ప్రేమను పోస్టర్ రూపంతో తెలియజేశారు. మొత్తానికైతే ఈ సన్నివేశం చూసి అటు అభిమానులు ఇటు మెగా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రిగా పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చేపడుతున్నారు.
“కొణిదెల పవన్ కళ్యాణ్” అనే మనం 💪🏼 pic.twitter.com/csf2MEiUOz
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 12, 2024