Sai Dharam Tej: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి ధరమ్ తేజ్.. త్వరలో నిర్చితార్థం..!

Sai Dharam Tej: ఇటీవల కాలంలో మెగా ఇంట్లో వరుస శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మెగా వారసురాలు క్లింకార వచ్చిన వేలా విశేషం ఏమో కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం కలిసి వస్తూనే ఉంది. ఈ బుట్ట బొమ్మ పుట్టి మరో ఆరు రోజులు అయితే సంవత్సరం అవుతుంది.

జూన్ 20న రాంచరణ్ అండ్ ఉపాసన దంపతులకు జన్మించింది ఈ బుడ్డది. అయితే ఈమె పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో వరుస సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మరో సెలబ్రేషన్ జరుపుకోనుంది మెగా ఫ్యామిలీ. మెగా హీరో సాయి ధరం తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

abdhul-comments-on-sai-dharam-tej
abdhul-comments-on-sai-dharam-tej

విరూపాక్ష చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ హీరో ప్రజెంట్ గాంజా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఓ బిజినెస్ మాన్ కూతురును ఈ హీరో ఇష్టపడ్డాడట. అంతేకాకుండా ఆ అమ్మాయి.. మెగా ఫ్యామిలీ కి కూడా నచ్చడంతో త్వరలో నిర్చితార్థం చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు