Sai Dharam Tej : హ్యట్సాఫ్ బ్రో… రీల్ హీరో ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్… మెగా కంపౌండ్ నుంచి వచ్చిన ఈ హీరోకు మాట వరుసకు చెప్పడానికి కూడా ఒక్కటి అంటే ఒక్క మైనస్ ఉండదు. అనవసరమైన విషయాల్లో తలదూర్చడు. సమాజానికి అవసరమైన వాటిని వదిలిపెట్టడు. అలాగే తాను చేసిన మంచి పని గురించి బయటి చెప్పుకోవాలని అనుకోడు. నిజానికి ఈ మెగా మేనల్లుడి గురించి ఇప్పుడు కూడా ఇవన్నీ చెప్పుకోలేం. కానీ, ఇలాంటి టైంలోనే మాట్లాడుకోవాలి.

అందరికీ గట్టి వార్నింగ్…

ఓ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యే వరకు వదిలి పెట్టలేదు. వాళ్లకు సాయి ధరమ్ తేజ్ రాక్షసుడే కావాచ్చు. కానీ ఎంతో మందికి ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. మళ్లీ చిన్న పిల్లలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. చేస్తే శిక్ష తప్పుదు అని సమాజంలో ఉన్న కొంత మంది నీచులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో కానీ, ఇంకా ఎక్కడైన కానీ చిన్న పిల్లల గురించి చెడుగా మాట్లాడాలంటే.. వెన్నులో వణుకు పూట్టేలా చేశాడు.

ఆదివారం ఉదయం నుంచి…

డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ పై ఓ యూట్యూబర్ చేసిన అసభ్యకర పదాలను ఖండిస్తూ ఆదివారం ఉదయం నుంచే తన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా పోస్ట్ లు పెట్టాడు. ఈ పోస్ట్ లకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర డీజీపీ స్పందించారు. అంతే కాదు, ఆ యూట్యూబర్ పై కేసు కూడా నమోదు చేశారు.

- Advertisement -

దీంతో రీల్ హీరో ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయాడు. వారిపై కేసు నమోదు చేయాలి అని సాయి ధరమ్ తేజ్ చేసిన పోరాటానికి ఇండస్ట్రీలో ఇతర హీరోలు కూడా సపొర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్ తమ ట్విట్టర్ ఖాతాలో సాయి ధరమ్ కు సపొర్ట్ ఇచ్చారు.

మామే గురువు కదా… ఆయన బాటలోనే…

Sai Dharam Tej is not a reel hero... He is a real hero
Pawan Kalyan – Sai Dhram Tej

సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా అభిమానించేది పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కేవలం మామ మాత్రమే కాదు. సాయి ధరమ్ తేజ్ కి అన్ని నేర్పించిన గురువు కూడా. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సాయి ధరమ్ తేజ్ రియాక్షన్ అందరం చూశాం. అలాగే పవన్ కళ్యాణ్ లా తాను కూడా సాయం చేయాలని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు ఈ ఇష్యూతో.. సాయి ధరమ్ తేజ్ ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ నే చూస్తున్నట్టు ఉంది అంటూ మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు