Sai Dharam Tej : పవన్ ను బండ బూతులు తిట్టినా ఈ హీరోలో చలనం ఉండదు… ఎందుకంటే?

Sai Dharam Tej : ఇటీవల అసభ్యకరమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేయడంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించాడు. ప్రణీత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి నటుడు ఆయనే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా అభ్యర్థించారు. దీంతో ఒక్కసారిగా ఇదో ఉద్యమంగా సాగి, పోలీసులు వెంటనే చర్యలు తీసుకునే స్థాయికి వెళ్ళింది. అయితే ప్రణీత్ ఘటనతో ఒక్కసారిగా తేజ్ ఇమేజ్ రియల్ హీరో అనే లెవెల్ కి వెళ్ళింది. కానీ మెగా అభిమానులకు అంతుపట్టని విషయం ఏమిటంటే ఎవరికో ఏదో జరిగితే ఇంత రియాక్ట్ అయిన తేజ్ పవన్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటాడు ? తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.

పవన్ విషయంలో తేజ్ మౌనం ఎందుకంటే?

ప్రణీ త్ అరెస్ట్ విషయంలో సాయి తేజ్ చూపిన చొరవకు, ఈ విషయంపై సాయి తేజ్ తన దృఢ వైఖరిని చాలా మంది అభినందిస్తున్నారు. అయితే అదే సమయంలో మెగా ఫ్యాన్స్ అందరూ సాయి తేజ్ ను పవన్ కళ్యాణ్ ను ఎవరెన్ని బండ బూతులు తిట్టినా మీలో ఎందుకు చలనం ఉండదు? అంటూ ప్రశ్నించారు. ఒక నెటిజన్ అయితే ఏకాండ పవన్ కళ్యాణ్‌ను ఎవరో  దుర్భాషలాడుతున్న వీడియోను షేర్ చేస్తూ, సాయి తేజ్‌ని తన మామను ఎవరైనా తిట్టినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటారని ప్రశ్నించారు. అయితే నిజానికి ఇప్పటిదాకా తేజ్ ఈ విషయం గురించి స్పందించలేదు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు ఎవరైనా పవన్‌ని విమర్శించినా, దూషించినా తాను ఎందుకు సైలెంట్‌గా ఉంటానని సాయి తేజ్ వివరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

- Advertisement -

సాయి తేజ్ రియాక్షన్ ఇదే

ఒకానొక సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ మాట్లాడుతూ… పవన్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మెగా హీరోలందరికి ఓ మాట చెప్పారని అన్నారు. సాయితేజ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు ఫోన్ చేసి తన రాజకీయ ప్రణాళికలను తెలియజేసినట్లు చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలు తనను విమర్శించడం, దుర్భాషలాడడం కూడా మొదలు పెడతారని ముందే పవన్ వివరించారట. కానీ మీరు వాటిలో దేనికీ స్పందించకూడదు. ఎవరైనా నన్ను విమర్శిస్తే మీరు ప్రశాంతంగా ఉండరని నాకు తెలుసు. కానీ మీరు మౌనంగా ఉంటేనే మంచిది. కాబట్టి మీరు నాపై మీ ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని పవన్ ముందుగానే మెగా హీరోలందరిని హెచ్చరించారనే విషయాన్ని ఆ వీడియోలో తేజ్ వెల్లడించారు. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలపై సాయి ధరమ్ తేజ్ సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా వాటి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ మాట్లాడడు. ఇన్నాళ్ళూ పవన్ విషయంలో మెగా హీరోలు ఎందుకు చోద్యం చూస్తూ ఉండిపోతారు అని తలలు బద్దలు కొట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్ కు మొత్తానికి ఆన్సర్ దొరికిందన్నమాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు