Sai Dharam Tej: ‘ శ్రీకాంత్’ రియల్ స్టోరీ.. కంటతడి పెట్టుకున్న మెగా హీరో..!

Sai Dharam Tej.. మెగా హీరో సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాక్సిడెంట్ తర్వాత ఈయన స్వభావం కూడా పూర్తిగా మారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సమాజంలో జరిగే విషయాలపై స్పందించడమే కాదు.. చట్టబద్ధమైన చర్యలు ఎవరైనా చేస్తే.. ఆ విషయాలను ప్రభుత్వాల వరకు తీసుకెళ్లి వారికి శిక్షపడేలా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్నటికీ నిన్న తండ్రి కూతుర్ల వ్యవహారంపై ప్రముఖ యూట్యూబ్ ప్రణీత్ హనుమంతును అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలు బాగుంటే స్పందించడంలో కూడా ఈయన ముందు వరుసలో ఉంటారు.. అందులో భాగంగానే తెలుగు వారు.. పైగా రియల్ స్టోరీ లను తెరకెక్కిస్తే మాత్రం స్పందించకుండా ఉంటారా.. ఈ క్రమంలోనే ఒక రియల్ స్టోరీని తెరపై చూపించగా ఆ సినిమా అద్భుతంగా ఉందని ఎమోషనల్ కామెంట్లు కూడా చేశారు.

Sai Dharam Tej: 'Sreekanth' real story.. Mega hero with tears in his eyes..!
Sai Dharam Tej: ‘Sreekanth’ real story.. Mega hero with tears in his eyes..!

శ్రీకాంత్ : ది రియల్ స్టోరీ..

తాజాగా దృష్టిలోపం ఉన్న పారిశ్రామికవేత్త మరియు బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, శ్రీకాంత్ బొల్లా జీవితం కథను శ్రీకాంత్ అనే పేరుతో తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం జరిగింది. రాజ్ కుమార్ రావ్ టైటిల్ రోల్ లో నటించగా.. ఈ చిత్రానికి తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. ఇక ఇందులో జ్యోతిక , అలయ ఎఫ్ మరియు శరత్ కేల్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2022 – 2023 మధ్య రెండు నెలల్లో భారతదేశం అలాగే యూఎస్ఏ లో వివిధ ప్రదేశాలలో ఈ సినిమాను చిత్రీకరించగా..అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఏడాది మే 10వ తేదీన థియేటర్లలో వచ్చి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉండగా.. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఒక స్పెషల్ ట్వీట్ చేయడమే కాదు ఎమోషనల్ కామెంట్లు కూడా చేశాడు..

శ్రీకాంత్ మూవీ పై స్పందించిన మెగా హీరో..

సాయి ధరంతేజ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో.. శ్రీకాంత్ ఫిలిం పోస్టర్ ను షేర్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు.. మన సొంత తెలుగు ఐకాన్ శ్రీకాంత్ బొల్ల గారి జీవిత కథ స్ఫూర్తితో శ్రీకాంత్ చిత్రాన్ని చాలా అందంగా చిత్రీకరించారు.. ఈ సినిమా ఇందాకే చూశాను.. మీరు నిజంగా హీరో సార్. రాజ్ కుమార్ రావ్.. మీరు గొప్ప అద్భుతమైన ప్రదర్శనను ప్రేక్షకులకు అందించారు.. ఈ మధురమైన స్ఫూర్తిదాయకమైన కథనానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను ఆలోచన లోకి నెట్టి వేయడమే కాదు నా చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.. ముఖ్యంగా శ్రీకాంత్ బొల్ల ఎంతోమంది జీవితాలకు ఆదర్శ ప్రాయం.. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాము అంటూ సాయి ధరంతేజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు