Sai Dharam Tej: తల్లిదండ్రులకు హెచ్చరిక.. దయచేసి పిల్లల వీడియోలు షేర్ చేయొద్దు..!

Sai Dharam Tej.. మెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరంతేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు మెగా హీరోల విషయంలో ఎప్పుడు పలు జాగ్రత్తలు తీసుకునే సాయి ధరంతేజ్ అంటే మెగా అభిమానులకు కాస్త అభిమానం ఎక్కువే.. అందుకే ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు థియేటర్ల వద్ద క్యూ కడుతూ ఉంటారు.. ఇకపోతే చివరిగా సాయిధరమ్ తేజ నుంచి బ్రో సినిమా మాత్రమే వచ్చింది. ఇక ఇప్పుడు గాంజా శంకర్ సినిమాను చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ నిర్మాతతో రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో తన 18వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాయిధరమ్ తేజ్. అయితే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్ పై ఇంత బడ్జెట్ పెట్టడం.. రిస్క్ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా సాయిధరమ్ తేజ్ యువతను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Sai Dharam Tej: Warning to parents.. Please don't share children's videos..!
Sai Dharam Tej: Warning to parents.. Please don’t share children’s videos..!

తల్లిదండ్రులకు హెచ్చరిక..

సోషల్ మీడియా అంశాలపై ఎప్పుడు స్పందించే సాయి ధరంతేజ్ తాజాగా మరో విషయాన్ని హెచ్చరికగా షేర్ చేశాడు.. ప్రముఖ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది.. సాయి ధరంతేజ్ తన ఎక్స్ పోస్టులో.. సోషల్ మీడియా నిర్దాక్షిణ్యంగా.. ప్రమాదకరంగా మారింది.. కొన్ని మానవ మృగాలను నియంత్రించడం చాలా కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా మీ పిల్లలు, వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు కాస్త జ్ఞానంతో ఆలోచించండి.. మీరు కూడా మీ పిల్లలు ఎటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేయవద్దు.. మీ పిల్లలు కూడా ఈ విషయంపై జాగ్రత్తపడేలా చూసుకోండి.. ఎందుకంటే మానవ మృగాల నుంచి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడడం చాలా కష్టతరంగా మారుతుంది.. ఆ తర్వాత మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దయచేసి ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించండి అంటూ తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు సాయి ధరంతేజ్.. తాజాగా కొంతమంది యూట్యూబర్స్ , ఇన్ఫ్లుయెన్సర్లు తండ్రి కూతుర్ల బంధంపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై సాయి ధరంతేజ్ ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

సాయి ధరంతేజ్ పై ప్రశంసలు..

ఈ విషయంపై పలువురు నెటిజన్లు సాయిధరమ్ తేజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. ప్రత్యేకంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తప్పనిసరి అని కొంతమంది క్రూరుల నుంచి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలని.. మన బంధాలు విలువలకు ప్రాముఖ్యత ఇవ్వాలని.. ఈ విషయాన్ని షేర్ చేసినందుకు నిజంగా మీపై మరింత గౌరవం పెరిగింది అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు