Sai Durg Teja: పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా సినిమా

Sai Durg Teja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో సాయి ధరంతేజ్ ఒకరు. అయితే రీసెంట్ గా సాయి తేజ్ తన పేరుని సాయి దుర్గ్ తేజ్ గా మార్చుకున్నారు. రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా మిగిలింది. ఈ సినిమా తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాలో హీరోగా నటించాడు సాయి తేజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.

హిట్స్ కంటే ఫ్లాప్స్

సాయి తేజ్ కెరియర్ విషయానికొస్తే సాయితేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే కూడా ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక టైం లో సాయి తేజ్ ఎంచుకున్న స్క్రిప్ట్ సెలక్షన్స్ చూసి మరో పవన్ కళ్యాణ్ అని కూడా ఫీలయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దశలో జానీ సినిమా తర్వాత వరుస డిజాస్టర్ సినిమాలు చేశాడు. అయినా ఆ టైంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది కానీ ఎక్కడా తగ్గలేదు. ఇకపోతే సాయి తేజ విషయానికొస్తే పర్సనల్ సాయి తేజను ఇష్టపడే అభిమానులు చాలామంది ఉన్నారు.

Sai Dharam Tej

- Advertisement -

సాయి తేజ్ సెకండ్ లైఫ్

సాయి తేజ్ కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దేవకట్ట దర్శకత్వంలో చేసిన రిపబ్లిక్ సినిమా మంచి ప్రశంసలను అందుకుంది. ఆ సినిమా కంటే ముందు సాయి తేజ్ ఒక రోడ్డు యాక్సిడెంట్ కు గురయ్యారు దాదాపు సాయితేజ్ లైఫ్ అనుకుంది అయిపోయింది అనుకునే తరుణంలో బతికి బయటపడ్డాడు. కోలుకున్న తర్వాత సాయి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన. పాన్ ఇండియా స్థాయిలో సాయికి గుర్తింపు తీసుకొచ్చింది.

మరో పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు

విరూపాక్ష తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను Hanuman నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అని విశ్వసనీ వర్గాల సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు