Sai Pallavi: సాయి పల్లవి వెనుకున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

Sai Pallavi.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొత్తగా హీరోయిన్లు అడుగుపెట్టినప్పుడు అదృష్టం బాగుంటే నేరుగా హీరోయిన్ గానే ఇండస్ట్రీలోకి వస్తారు.. కానీ అవకాశాల కోసం వెతుకులాటలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు వచ్చినా సరే నటిస్తూ ఉంటారు.. అలా ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత కాలం కలిసి వచ్చినప్పుడు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సక్సెస్ అవుతూ ఉంటారు.. అలా వారు సక్సెస్ అయిన తర్వాత ఏదైనా సందర్భంలో వారు నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు బయట పడితే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు.. ఈ క్రమంలోనే చార్మీ, త్రిష, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఒకానొక సమయంలో కరీనాకపూర్ , ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్ల సినిమాలలో వారికి ఫ్రెండ్ క్యారెక్టర్ లేక సైడ్ క్యారెక్టర్ లో నటించిన వారే.. ఇప్పుడు అలాంటి వారిలో మమితా బైజు కూడా ఒకరు.. ఈమె సాయి పల్లవి నటించిన సినిమాలో వెనుక కనిపించి ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

ప్రేమలు సినిమాతో స్టార్ హీరోయిన్..

ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మమిత బైజు.. దీంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈమె అందానికి , ఆటిట్యూడ్ కి ఫిదా అయ్యారు. మమిత బైజు గతంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది.. అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు..

పడి పడి లేచే మనసు సినిమాలో మమిత బైజు..

Sai Pallavi: Do you remember who is this girl behind Sai Pallavi..?
Sai Pallavi: Do you remember who is this girl behind Sai Pallavi..?

టాలీవుడ్ హీరో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు సినిమాలో మమిత బైజు నటించినట్లుగా తెలుస్తోంది.. వాటి గురించి చూద్దాం. ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కించారు డైరెక్టర్ హను రాఘవపూడి.. 2018 డిసెంబర్ 21న ఈ సినిమా విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. పాటలైతే ఈ సినిమాలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో మమిత బైజు నటించినట్లుగా తెలుస్తోంది. పడి పడి లేచే మనసు సినిమాలో ఒక సాంగ్ లో సాయి పల్లవి వెనకాల నడుచుకుంటూ వస్తున్న యువతిగా మమిత బైజు కనిపిస్తోంది. దీంతో ఈ విషయాన్ని పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు. మమిత జూనియర్ ఆర్టిస్టుగా కూడా నటించిందా అంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

- Advertisement -

షార్ట్ ఫిలిమ్స్ లో కూడా అవకాశం..

మమిత బైజు హీరోయిన్ కాకముందు పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించింది అన్నట్లుగా తెలియజేసింది.. అంతేకాకుండా పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. మొత్తానికి మమిత ఇందులో నటించిందా లేదా అనే విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అభిమానులైతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను, వీడియోను వైరల్ గా చేస్తున్నారు. మమిత ప్రేమలు సినిమాతోనే టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. దీంతో దర్శక నిర్మాతలు సైతం డేట్ల కోసం క్యూ కడుతున్నట్లుగా సమాచారం.

తెలుగులో స్టార్ హీరో సరసన మమిత..

మలయాళం ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా మంచి విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ మరింత క్రేజ్ అందుకుంటుంది మమితా బైజు. త్వరలోనే టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోతో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by @then_gooo

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు