Sai Pallavi: తండ్రి పుట్టిన రోజు.. అలాంటి ఫోటోతో ఎమోషనల్ పోస్ట్…!

Sai Pallavi.. ప్రముఖ బ్యూటీ సాయి పల్లవి మొదటిసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. తన అందంతో, నటనతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కట్టుబొట్టు సాంప్రదాయంగా ఆకట్టుకున్న సాయి పల్లవి.. ఇప్పటికీ కూడా బోల్డ్ పాత్రలకు దూరం అనే చెప్పాలి.. అయినా సరే తన నటనతో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను తగిలించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇంకొక వైపు వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తోంది.ఇటీవలే ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈమె డిగ్రీ పట్టా కూడా అందుకుంది.

Sai Pallavi: Father's birthday.. Emotional post with such a photo...!
Sai Pallavi: Father’s birthday.. Emotional post with such a photo…!

చిన్ననాటి ఫోటో షేర్ చేసిన సాయి పల్లవి..

ఇకపోతే ఈరోజు స్థాయి పల్లవి తండ్రి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు.. తన తండ్రి తనను ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సాయి పల్లవి. సాధారణంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని సాయి పల్లవి తాజాగా తన తండ్రి సెంతామరై కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. మాకు ఇంతటి ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.. మీ జీన్స్ నుంచి ఫుట్బాల్ ఆడటానికి బలమైన కాళ్లు ఇచ్చారు.. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు.. చాలా సెన్సిటివ్ గా ఉన్న మమ్మల్ని ఇంత స్ట్రాంగ్ గా మార్చినందుకు… నాకు ,పూజాకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

సాయి పల్లవి సినిమాలు..

సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరు సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. అన్ని సినిమాలతోనూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. ఇకపోతే నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ వంటి సినిమాలలో నటించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నటించిన గార్గి, విరాటపర్వం లాంటి చిత్రాలు మాత్రం కాస్త నిరాశ మిగిల్చాయి. ఇక ఇప్పుడు మళ్లీ నాగచైతన్య తో తండేల్ అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రణబీర్ కపూర్ తో కలిసి హిందీ రామాయణంలో నటిస్తోంది.. సీతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.. మొత్తానికి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో ఒకేసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది సాయి పల్లవి. మరి ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi_mh)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు