Sai pallavi : పెళ్లికి ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సాయి పల్లవి సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తన యాటిట్యూడ్ ద్వారా సాయి పల్లవి ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సాయి పల్లవి స్టార్ హీరోలకు జోడిగా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నప్పటికీ ఆమె మాత్రం అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

రీమేక్ సినిమాలలో అవకాశాలు వస్తున్నా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి తన 31వ బర్త్డేని చేసుకుంటుంది. ఇక సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఆమె గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి త్వరలోనే కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి అందరూ హీరోయిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

ఇక ఇదిలా ఉంటే, ఇంట్లో వాళ్ళు సాయి పల్లవికి పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 30 ప్లస్ అయిన సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి ఇక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వమంటున్నారు అనే విషయం తెలుస్తుంది. కానీ సాయి పల్లవి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదట. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే సాయి పల్లవి దాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి సాయి పల్లవి పెళ్లి సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు