Sai Pallavi: ఇన్నాళ్లకు బయటపడ్డ మోసం.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్.. ఎక్స్పెక్ట్ చేయలేదు గురూ..!

Sai Pallavi.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సక్సెస్ కోసం ఎంతో పాకులాడుతారు. అయితే ప్రారంభంలో మెరిసినప్పటికీ కూడా రెండు , మూడు ఫ్లాప్ లు పడితే మాత్రం కనుమరుగైపోతారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ యాక్టింగ్ తో, డాన్స్ టాలెంట్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఎన్ని ప్లాట్స్ పడినా సరే నిలదొక్కుకుంటూ ఉంటారు.అలాంటి వారిలో ప్రథమంగా వినిపించే పేరు సాయి పల్లవి. ప్రస్తుతం ఈమె సినిమాలు సక్సెస్ కాకపోయినా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి . లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినా అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా సాయి పల్లవి నిర్మాతల మనిషి అని, సినిమా నష్టపోతే ఖచ్చితంగా తన పారితోషకంలో సగానికి పైగా వెనక్కి ఇచ్చేస్తుందని అందరికీ తెలిసిందే.

Sai Pallavi: Fraud exposed all these years.. Fans are surprised.. Guru did not expect it..!
Sai Pallavi: Fraud exposed all these years.. Fans are surprised.. Guru did not expect it..!

సాయి పల్లవి సినిమాలు..

అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా ఈమె నాగచైతన్య సరసన తండేల్ అనే చిత్రంలో నటిస్తోంది. మరొకవైపు రణబీర్ కపూర్ రాముడిగా, కేజిఎఫ్ హీరో యష్ రావణాసురుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ గా నటిస్తున్న బాలీవుడ్ రామాయణంలో సీత క్యారెక్టర్ లో నటిస్తోంది సాయి పల్లవి. ఇక ఇదంతా పక్కన పెడితే , ఈమె ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన పాపులర్ డాన్స్ షో ఢీ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డాన్స్ తోనే కాదు అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ ఆమె సొంతం.

భారీ మోసం చేసిన సాయి పల్లవి.. ఫ్యాన్స్ షాక్..

అయితే ఇదిలా ఉండగా సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ విషయంలో పెద్ద మోసం జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఆమె పాత్రలకు ఆమె డబ్బింగ్ చెబుతుందని ఇన్ని రోజులు మనం నమ్మాము. కాని ఇదంతా అబద్ధం. ఆమె పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్టు ఉన్నారు. అది కూడా అమ్మాయి కాదు అబ్బాయితో.. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. ఇకపోతే ఫిదా , లవ్ స్టోరీ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవడానికి కారణమైన ప్రధాన అంశాలలో డైలాగ్ డెలివరీ కూడా ఒకటి . ముఖ్యంగా ఆ పాపులర్ డైలాగ్స్ ఉన్న సన్నివేశాలు అత్యధిక శాతం ఒక అబ్బాయి తో చెప్పించారు. ఇన్ని రోజులు సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్ చెబుతుందని నమ్మిన వాళ్లంతా కూడా మోసపోయామంటూ సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే మరికొంతమంది ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్న హీరోయిన్స్ అందరూ నిజంగానే డబ్బింగ్ చెబుతున్నారా..? లేక ఫోటోలకు ఫోజులిస్తున్నారా..?అని అనుమానాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో తనపై వచ్చే ప్రతి వైరల్ వార్తకు రెస్పాన్స్ అయ్యే సాయి పల్లవి, ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తున్నారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఆ అబ్బాయి కూడా సాయి పల్లవి డైలాగ్ ను చాలా అద్భుతంగా చెప్పి అందరిని అబ్బురపరిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు