Sai Pallavi: పదేళ్లుగా అతడితో రిలేషన్.. షాక్ ఇచ్చిన సాయి పల్లవి..!

Sai Pallavi.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే తన అందంతో , నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో యువతను కట్టిపడేసింది.. ఆ తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ బోల్డ్ పాత్రలకు దూరంగా ఉంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చూడడానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి.. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మేకప్ లేకుండానే తన సినిమాలలో నటించి తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.

Sai Pallavi: Relationship with him for ten years.. Sai Pallavi gave a shock..!
Sai Pallavi: Relationship with him for ten years.. Sai Pallavi gave a shock..!

సాయి పల్లవి కెరియర్..

తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈమె ఈమధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే… ఇప్పుడు తాజాగా నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో మరోసారి అవకాశాన్ని దక్కించుకుంది. గతంలోనే వీరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా భారీ సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది.. ఇకపోతే సాయి పల్లవి ఇటీవలే తన సిస్టర్ పూజా పెళ్లి జరిపించింది. పూజా పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేశారు.

10 ఏళ్లుగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న సాయి పల్లవి..

అయితే అభిమానుల కోరిక మేరకు తాను కూడా పదేళ్లుగా ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను అంటూ షాకింగ్ బాంబ్ పేల్చింది.. అయితే ఈ విషయం తెలిసి సాయి పల్లవిని ఇష్టపడే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు సాయి పల్లవి ఇంతవరకు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ విషయంపై తాజాగా సాయి పల్లవి స్పందించింది..

- Advertisement -

అతడితోనే రిలేషన్..

అవును నిజమే.. నేను గత పది సంవత్సరాలుగా ఒకరితో రిలేషన్ లో ఉన్నాను అంటూ చెప్పింది.. మహాభారతంలో అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి గురించి చాలా విషయాలు ఆమె తెలుసుకుందట.. గడిచిన పదేళ్లుగా అభిమన్యు క్యారెక్టర్ గురించి ఎంతో తెలుసుకున్నానని… అతనితో పది సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాను అని తెలిపింది సాయి పల్లవి.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

సాయి పల్లవి సినిమాలు..

ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది.. అక్కడ రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న హిందీ రామాయణంలో సీతగా నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే గతంలో మలయాళం సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఈమె మలయాళం సినిమాతోనే తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇప్పుడు హిందీ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు