Sai Pallavi : పెళ్ళై, పిల్లలున్న వ్యక్తితో సాయి పల్లవి ఎఫైర్

Sai Pallavi : సినిమా ఇండస్ట్రిలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే కోట్లాది మండి అభిమానుల గుండెల్లో నేచురల్ బ్యూటీగా స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. అయితే ఈ అమ్మడు పుకార్లకు దూరంగా ఉండాలి అనుకున్నా ఆ పుకార్లు మాత్రం ఆమెను వదలట్లేదు. తాజాగా ఆమె ఓ పెళ్ళయి, పిల్లలున్న వ్యక్తితో ఎఫైర్ నడుపుతోంది అనే బాంబ్ లాంటి రూమర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ రూమర్ల వెనక ఉన్నదెవరు అని ఆరా తీస్తున్నారు సాయి పల్లవి అభిమానులు.

పెళ్లయిన వ్యక్తితో సాయి పల్లవి డేటింగ్ ?

తాజాగా వైరల్ అవుతున్న రూమర్ల ప్రకారం సాయి పల్లవి ఒక నటుడితో డేటింగ్ చేస్తోంది. కానీ అతనికి ఇప్పటికే పెళ్ళయి, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. సాధారణంగానే హీరోయిన్ల చుట్టూ వివాదాలకు కొదవ ఉండదు. అలాగే సాయి పల్లవి సినీ లైఫ్ లో కూడా వింత గాసిప్స్ తెరపైకి వచ్చాయి. గతంలో అమరన్ సినిమా పూజా సమయంలో సాయి పల్లవి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దండ వేసుకుని, దగ్గరగా నిల్చున్న ఫోటోని షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్త గత ఏడాది సంచలనం రేపింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో సాయి పల్లవి స్వయంగా అది పుకారు మాత్రమేనని ధృవీకరించింది. కాగా తాజాగా ఆమె వేరే స్టార్స్ తో ఎఫైర్ నడుపుతోంది అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ నటుడు ఎవరనే దానిపై కొందరు ఊహాగానాలు చేయడం ప్రారంభించగా, ఇది కూడా ఎప్పటిలాగే కేవలం పుకారేనని ఆమె అభిమానులు అంటున్నారు.

From Assets to Fee Per Film, All You Want to Know About Sai Pallavi - News18

- Advertisement -

ఇదంతా వాళ్ళ పనేనా?

కొన్ని బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లు ఇప్పుడు సాయి పల్లవిపై ఓ పెళ్ళయి, పిల్లలున్న స్టార్ తో డేటింగ్ చేస్తోంది అంటూ ఒక ప్రధాన భారతీయ వార్తా నెట్‌వర్క్ ప్రారంభించిన పుకారును వైరల్ చేస్తున్నాయి. అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు ఇది సాయి పల్లవికి ఇబ్బంది కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా పుట్టించిన నిరాధారమైన పుకారు. “రామాయణం” సినిమాలో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి సీతగా నటించడం ఇష్టం లేని కొందరు బాలీవుడ్ నటీమణులు తమ పిఆర్ టీమ్‌లను ఉపయోగించి ఆమెపై ఇలాంటి చెండాలమైన గాసిప్‌లను ప్రచారం చేస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.

సాయి పల్లవి గతంలో పెళ్లయిన పురుషుల గురించి ఇలాంటి తప్పుడు డేటింగ్ పుకార్లను ఎదుర్కొంది. అయితే ఆమె ఎప్పుడూ వాటిపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకుంది. ప్రస్తుత పుకారు విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న అసూయ, పోటీ కారణంగా ఇలాంటి పుకార్లను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా వర్క్ ఫ్రంట్‌లో సాయి పల్లవికి అద్భుతమైన చిత్రాల లైనప్ ఉంది. అమరన్, నాగ చైతన్యతో కలిసితండేల్ అనే సినిమాలలో నటిస్తోంది. తండేల్ 2024 డిసెంబర్ 20న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ రామాయణం 2025లో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు