Sai Pallavi: నేరుగా థియేటర్స్ కి

ఫిదా సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.
సాయి పల్లవి కెరియర్ లో ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు మినహా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేవు. కానీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మాత్రం మిగతా హీరోయిన్స్ కంటే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. విరాటపర్వం ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయినా, రీసెంట్ గా రిలీజైన గార్గి మాత్రం మంచి విజయాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

ఎన్నో అంచనాలు మధ్య రిలీజైన గార్గి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గౌతం రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు సాయి పల్లవి ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లలోకి వెళ్లి నేరుగా ప్రేక్షకులను కలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సాయి పల్లవి చెన్నై, హైదరాబాద్‌లలో పలు థియేటర్స్ ను సందర్శించింది. చెన్నైలోని ఎస్‌పిఐ ఎస్కేప్, పివిఆర్ గ్రాండ్ గలాడా, వేలచ్చేరిలోని లక్స్ మరియు పివిఆర్‌లకు సాయి పల్లవి వచ్చిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సినిమా చూస్తుంటే అనుకోని విధంగా హీరోయిన్ ముందుకు రావడంతో సినీ ప్రేక్షకుల ఆనందాన్ని వీడియోలో చూడొచ్చు. సాయి పల్లవి సినిమా గురించి అభిమానులతో మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు