Sai Pallavi : ఫిలిం ఫేర్ లో సాయి పల్లవి హవా… తండేల్ సెట్లో సెలబ్రేషన్స్

Sai Pallavi : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తో దూసుకెళ్తున్న సాయి పల్లవి తాజాగా ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డులలో ఉత్తమ నటిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవికి ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఆమె ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్న తండేల్ మూవీ సెట్లో కూడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

తండేల్ సెట్ లో సెలబ్రేషన్స్…

సాయి పల్లవి… సౌత్ మూవీ లవర్స్ కి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచే గ్లామర్ కు దూరంగా ఉంటూ నటనకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇటీవల ప్రకటించిన ఫిలిమ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. పోటీలో ఉన్న అందర్నీ వెనక్కి నెట్టి మరో ఫిలింఫేర్ కు ఎంపికైంది. 2022లో రిలీజ్ అయిన విరాటపర్వం సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఎంపికైన సాయి పల్లవి, ఇప్పుడు 2023లో రిలీజ్ అయిన తమిళ మూవీ గార్గికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ని అందుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవిపై పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు అభినందనలు వర్షం కురిపిస్తున్నారు.

Image

- Advertisement -

ఈ సందర్భంగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తండేల్ సెట్ లో కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ తో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సెట్లో సాయి పల్లవితో అల్లు అరవింద్ టీం కేక్ కట్ చేయించి ఆమెను అభినందించారు. ప్రస్తుతం తండేల్ సెట్ లో సాయి పల్లవి టీం చేసిన సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా 2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

Image

సాయి పల్లవి ఖాతాలో పడిన ఫిలింఫేర్ అవార్డ్స్…

అయితే సాయి పల్లవి ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. తన కెరీర్లో ఇప్పటిదాకా ఆమె 4 ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకుంది. ఆమె నటించిన తొలి సినిమా ప్రేమమ్, ఫస్ట్ తెలుగు మూవీ ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలకు గాను గతంలో ఈ బ్యూటీ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు ఫిలింఫేర్ అవార్డులు అందుకోబోతూ ఇతర హీరోయిన్లు అందుకోలేని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు