Sai Pallavi: అప్పుడు ఛీ కొట్టింది.. రౌడీ హీరో మాయ చేశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త జోడి మొదలైందా అంటే.. అవుననే చెప్పాలి.. తాజాగా సాయి పల్లవి విజయ్ దేవరకొండ జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా రూపదిద్దుకుంటోంది. రాజా వారు రాణీ గారు సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు..ఇక రూరల్ యాక్షన్ డ్రామా గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి టైటిల్ “రౌడీ జనార్ధన్” అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం..

రౌడీ హీరోతో జతకట్టనున్న సాయి పల్లవి..

ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..దర్శకుడు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారట.. హీరోయిన్ పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే ఈమె అయితే ఈ పాత్రలో చాలా అద్భుతంగా నటిస్తుందని.. అందుకే ఈమెకు అవకాశం ఇవ్వాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఫిదా, ఎంసీఏ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సాయి పల్లవి మరో సినిమా చేయలేదు. అందుకే సాయి పల్లవి డేట్ ల కోసం దిల్ రాజు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే కథ నచ్చితే పాత్ర బాగుంటే ఇతర విషయాల గురించి పట్టించుకోను అని చెప్పిన సాయి పల్లవి ఇప్పుడు ఓకే అయితే విజయ్ దేవరకొండ , సాయి పల్లవి లాంటి క్రేజీ కాంబో తెరపై చూసే అవకాశం దక్కుతుంది.

విజయ్ తో మూవీకి ఒప్పుకుంటుందా..

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ తో సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ..ఈ రెండు ముగిసిన తర్వాతనే రవికిరణ్ కోలాతో సినిమా ఉంటుందని సమాచారం.. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే గతంలో సాయి పల్లవి రౌడీ హీరోతో సినిమా చేయను అంటూ గట్టిగా చెప్పింది. అంతేకాదు అప్పట్లో విజయ్ దేవరకొండ తో సినిమా అంటే ఆమె చీ కొట్టింది కూడా.. ఇలాంటిది ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ తో అవకాశం అంటే నటిస్తుందా అంటూ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఒకప్పుడు రౌడీ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..

Sai Pallavi: Then Chi hit.. Did the rowdy hero cheat..?
Sai Pallavi: Then Chi hit.. Did the rowdy hero cheat..?

అసలు విషయంలోకి వెళితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఈమె ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.. అయితే విజయ్ దేవరకొండ హీరోగా.. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్.. ఇందులో మొదటి సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. అయితే ఈ సినిమా ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు సమాచారం అలాగే శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ఖుషి సినిమాలో కూడా ఈమెనే తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట.. అలా ఈ రెండు చిత్రాలు విజయ్ దేవరకొండ వి కావడం గమనార్హం.. ఇకపోతే విజయ్ దేవరకొండ అంటే బోల్డ్ సీన్స్ కి కేరాఫ్ అడ్రస్.. ఈ క్రమంలోనే ఆమె ఆఫర్స్ ను తిరస్కరించింది.. ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ తో సినిమాలో అవకాశం రాబోతోందని సమాచారం .. మరి ఇప్పుడైనా ఈమె విజయ్ దేవరకొండ తో నటించడానికి ఇష్టపడుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు