BABY: ఆ హీరోకు కథ చెప్తే.. ఛీ అన్నాడు- సాయి రాజేష్ స్పీచ్ వైరల్

సాయి రాజేష్.. నిన్న మొన్నటి వరకు స్పూఫ్ సినిమాలు తీస్తాడనే పేరున్న ఈ డైరెక్టర్ బేబీ సినిమాతో ఒక దర్శకుడిగా తన కేపబిలిటీ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బేబీ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాల్ని అందుకుంటుంది.

ఈ సందర్భంగా నిన్న సాయంత్రం మూవీ టీం సక్సెస్ మీట్ ఫంక్షన్ నిర్వహించగా ఆ కార్యాక్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

బేబీ సినిమాకు ముందు సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు ను హీరోగా పరిచయం చేస్తూ హృదయ కాలేయం అనే ఒక స్పూఫ్ సినిమాను తీసాడు. పెద్ద హీరోల సినిమాలను కామెంట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

- Advertisement -

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ ఆ తరువాత కొబ్బరిమట్ట అనే మరో సినిమా తీసాడు. అయితే ఇలాంటి  స్పూఫ్ సినిమాలు తీయడం వల్ల ఇండస్ట్రీలో సాయి రాజేష్ ను ఒక క్రిందిస్థాయి దర్శకుడిగా పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఆ తరువాత తన పంథా మార్చుకున్న సాయి రాజేష్ కలర్ ఫోటో సినిమా కథను రాసి, ఆయనే నిర్మిచారు. అయితే ఈ సినిమా సాయి రాజేష్ కు ప్రొడ్యూసర్ మంచి పేరు, అవార్డ్స్ ను తెచ్చిన డైరెక్టర్ గా మాత్రం తాను ఆశించిన గుర్తింపు లభించలేదనే లోటు ఉండటంతో, తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే కసితో బేబీ సినిమాను తెరకెక్కించాడు.

అయితే ముందుగా బేబీ కథ రాసుకున్న సాయి రాజేష్ ఈ సినిమా కథను ఒక హీరోకు చెప్పడానికి వెళ్ళాడట.. కానీ ఆ హీరో కథ విని సాయి రాజేష్ మొహం మీదనే ఛీ నువ్వొక డైరెక్టరా నీతో సినిమా నేను చేయను అని చెప్పేసాడట.ఈ విషయాన్నీ ఇన్నాళ్లుగా తనలోనే దాచుకున్న ఈ డైరెక్టర్ నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో తన మనసులో మాటను బయట పెట్టగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు