Sai Tej : సీనియర్ ఆర్టిస్ట్ కు మెగా హీరో డొనేషన్, చనిపోదాం అనుకున్న టైంలో మీరు మంచి సాయం చేశారు అంటూ నటి కన్నీళ్లు

Sai Tej : రేయ్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు సాయిధరమ్ తేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లే ఉన్నాయని చెప్పొచ్చు.

కానీ సాయి తేజ్ పర్సనల్ వ్యక్తిత్వం వల్ల ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ వచ్చా వచ్చాడు అని చెప్పొచ్చు. అయితే సాయి తేజ్ కెరియర్ లో కొన్ని సినిమాలు మాత్రం అద్భుతమైన సెలెక్షన్స్ అని చెప్పొచ్చు. దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.

రిపబ్లిక్ లాంటి ఒక కంటెంట్ ను సాయిధరమ్ తేజ్ ఓకే చేసి సినిమా చేయటం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అయితే సాయి తేజ్ కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు విరూపాక్ష సినిమాలో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు సాయి తేజ్. అయితే విరూపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా అద్భుతమైన రికార్డును కొల్లగొట్టింది దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

- Advertisement -

Pavala Shyamala

మెగా హీరో సాయి తేజ్ ఫిలిం జర్నలిస్ట్ లుకు ఐదు లక్షల రూపాయలను డొనేషన్ గా ఇచ్చారు. అయితే ఐదు లక్షలు రూపాయలు సీనియర్ నటి పావలా శ్యామలకు ఒక లక్ష రూపాయలు ఇవ్వమని జర్నలిస్టులకు చెప్పారు. సీనియర్ నటి పావలా శ్యామలకు ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు. డొనేషన్ ఇవ్వడంతో పాటు ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడారు. సీనియర్ నటి పావలా శ్యామల సాయిధరమ్ తేజ్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చనిపోదాం అనుకున్న టైంలో మీరు మంచి సాయం చేశారు. ఇంతకుముందే మీ కుటుంబం నుంచి చిరంజీవి గారు రెండు లక్షలు ఇచ్చారు. మీరు సాయం మర్చిపోయారు అనుకున్నాను. సమయానికి నాకు , నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు. చాలా థాంక్స్ బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు