Sai Tej: తెలంగాణ సీఎం ను స్వయంగా కలిసిన సాయి తేజ్, కారణం ఏంటంటే.?

Sai Tej: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సాయి తేజ ఒకరు. మెగా వారసుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి తేజ్ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. వాస్తవానికి చెప్పాలంటే సాయి తేజ లో హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా సాయి తేజ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. దీనికి కారణం సాయి తేజ్ వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. ఏ కొత్త సినిమా రిలీజ్ కున్నా కూడా సాయి తేజ్ ట్విట్టర్ వేదిక సినిమాను ప్రమోట్ చేస్తూ తన బెస్ట్ విషెస్ చెబుతాడు.

కొన్ని సందర్భాల్లో సాయి తేజ మాట్లాడిన మాటలు, కొన్ని విషయాల్లో సాయి తేజ్ నిలబడిన తీరు ఇవన్నీ కూడా సాయితేజ్ పైన రెస్పెక్ట్ పెంచుతూ ఉంటాయి. ఇకపోతే రిపబ్లిక్ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది అనుకునే తరుణంలో, సాయి తేజ్ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగింది. దాదాపు సాయి తేజ్ మనకు దూరమైపోయాడు అనుకునే తరుణంలో చాలామంది ప్రార్థనలు, సాయితేజ్ మంచితనం మళ్లీ మనకు దగ్గర అయ్యేలా చేసింది. ఇకపోతే ఆ తర్వాత సాయి తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

Sai Tej with Cm Revanth Reddy

- Advertisement -

పవన్ కళ్యాణ్ ని సాయి తేజ్ ఎంతగా ప్రేమిస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే సాయి తేజ్ చేసిన కొన్ని పనులు కూడా గమనిస్తే పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉన్న రీల్ పై డిస్కషన్ పెట్టి చాలా అసభ్యంగా మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని ఏ సెలబ్రెటీ అడ్రస్ చేయకముందు సాయితేజ్ అడ్రస్ చేసి వాళ్లను శిక్షించాలి అని చాలామంది రాజకీయ నాయకులను ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వాళ్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. సాయి తేజ్ ట్రీట్ పై రేవంత్ రెడ్డి స్పందించి, ప్రణీత్ హనుమంతు పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇకపోతే ఈ విషయంపై అభినందించడానికి స్వయంగా సాయి తేజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు