Sai Tej: ఏ సినిమాను వదిలిపెట్టడు అది సాయిధరమ్ తేజ్ అంటే

Sai Tej: మెగా హీరోస్ లో సాయి ధరంతేజ్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. చేసిన సినిమాలలో ఎక్కువ సక్సెస్ రేట్ రాకపోయినా కూడా సాయి తేజ్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. దీనికి కారణం సాయి తేజ్ వ్యక్తిత్వం అని చెప్పాలి. కొన్ని విషయాలపై సాయి తేజ్ స్పందించే తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలానే ఫ్యాన్స్ తో కూడా మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. వీటన్నిటిని మించి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడం. పవన్ కళ్యాణ్ కి సంబంధించి దేన్నైనా డిఫెండ్ చేయటం, ఇవన్నీ సాయి తేజ్ కి ప్లస్.

ఇక సాయి తేజ్ సినిమా విషయానికి వస్తే సాయి తేజ్ చేసిన సినిమాలలో మంచి హిట్ సాధించినవి చిత్రాలహరి, ప్రతిరోజు పండుగ, రిపబ్లిక్ వంటి సినిమాలు ఉంటాయి. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి నటించాడు సాయి. సాయి తేజ్ ఎప్పుడు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటాడు. ఇక రీసెంట్ గా ఒక యూట్యూబర్ విషయంలో సాయి తేజ స్పందించిన విధానం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. సాయి తేజ్ ఒక ట్వీట్ వేయగానే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు రెస్పాండ్ అయి ఆ యూట్యూబర్ కి సరైన శిక్షను విధించారు.

Sai Dharam Tej

- Advertisement -

ఇక ఇది మాత్రమే కాకుండా సాయి తేజ్ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమాని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు చెబుతూ ఉంటాడు. ఇప్పటివరకు సాయి తేజ్ ఎన్నో సినిమాలను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా దేన్నీ వదలకుండా అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. తన సినిమా ప్రమోషన్ల కంటే కూడా మిగతా సినిమాల ప్రమోషన్స్ కి ట్విట్టర్ ను ఎక్కువగా వాడుతుంటాడు సాయి. ఇక రీసెంట్గా ధనుష్ నటించిన మైల్స్టోన్ ఫిలిం రేపు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ సినిమా కూడా ఆల్ ది బెస్ట్ తెలిపాడు సాయి తేజ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు