Saif Ali khan: దేవర కి ఎదురెళ్ళే ప్రతినాయకుడు “భైరా”…

Saif ali khan devara first look:

టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సినిమాల్లో “దేవర” ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఆచార్య ప్లాప్ వల్ల గ్యాప్ తీసుకున్న కొరటాల శివ దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు.

అందుకే కొంచెం లేట్ అయినా కూడా స్క్రిప్ట్ లో ఛేంజ్ చేసి షూటింగ్ మొదలుపెట్టి, నాన్ స్టాప్ గా సినిమా తీస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పోస్టర్ తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. అయితే దాని తర్వాత మాత్రం ఇప్పటివరకు మళ్ళీ దేవర నుండి అప్డేట్ రాలేదు. తాజాగా సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా అతని పాత్రని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు.

ఇక పోస్టర్ డార్క్ మోడ్ లో ఉండి ఆకట్టుకోగా, ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ పాత్ర పేరు “భైరా” అని పోస్టర్ లో చెప్పడం జరిగింది. ఇక ఆ ఫస్ట్ లుక్ లో సముద్రంలో పడవల్ని చూపించారు. అందువల్ల ఈ సినిమా సముద్ర నేపథ్యంలో సాగుతుందని తెలిసిపోతుంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అంత రేంజ్ లో లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంది.

- Advertisement -

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తవగా, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన సెట్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమాను వచ్చే ఏడాది జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు