Sakshi Agarwal : వారి కోసమే..!

శాండల్ వుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది సాక్షి అగర్వాల్. ఇక సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తమిళం సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులకు దగ్గర అయింది సాక్షి అగర్వాల్.
ఇప్పుడు తమిళ్, కన్నడ, మలయాళ భాషలలోనే కాక ఇంగ్లీష్ భాషలలోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. చీర కట్టునుంచి బికినీ వరకు నిర్మొహమాటంగా పోస్ట్ చేసే సాక్షిపై.. సినిమాలలో అవకాశాల కోసమే ఇలాంటి గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుందని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఇదే విషయాన్ని ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా అవకాశాల కోసమే ఇలా చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సాక్షి అగర్వాల్ సమాధానం ఏంటంటే.. ” నా చేతిలో ఇప్పుడు భగీర, నాన్ కడవుల్ ఇలై, గెస్ట్ 2, ది నైట్, పురవి వంటి ఎనిమిది సినిమాలు ఉన్నాయి. సినిమాలలో అవకాశాల కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వారి సంతోషం కోసమే  ఎక్స్ పోజింగ్ చేస్తున్నా.  సుమారు రెండు మిలియన్ల మంది నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. వారి కోసమే ఇలా చేస్తున్నా” అని చెప్పుకొచ్చింది సాక్షి అగర్వాల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు