Salaar : స్పెషల్ ట్రీట్

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఇటు దక్షిణాదిన, అటు బాలీవుడ్ లోనూ అందరి చూపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపైనే ఉంది. సాహో, రాధేశ్యామ్ వంటి వరుస ప్లాప్ లు ప్రభాస్ క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సలార్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్.. “కేజిఎఫ్” తో ఈ పేరు ఇండియా అంతా మారుమోగిపోతుంది. డబ్బులు సంపాదించడానికి సినిమాల్లోకి వచ్చానని ధైర్యంగా చెప్పుకునే ప్రశాంత్ నీల్.. సినిమా టేకింగ్ లో తనదైన ముద్రను చూపిస్తూనే వచ్చాడు. కేవలం మూడు సినిమాలకే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే, అర్థం చేసుకోవచ్చు ఆ టేకింగ్ కి ఎంతమంది ఫిదా అయిపోయారు అని.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న చిత్రం “సలార్”. అయితే ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం నుండి ఓ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న మధ్యాహ్నం 12:58 నిమిషాలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ అప్డేట్ సినిమా విడుదల తేదీకి సంబంధించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు