Salman Khan : సల్మాన్ కాల్పుల ఘటనలో మరో ముగ్గురు అరెస్ట్

Salman Khan : ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని తేలింది. ఇప్పుడు ఈ విషయంలో మరో మేజర్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ముగ్గురు అరెస్ట్..

సల్మాన్ ఖాన్ ముంబై నివాసం బయట కాల్పులు జరిపిన షూటర్లకు కూడా సహాయం అందించినట్లు అనుమానిస్తూ, ఈ నేరాన్ని అమలు చేయడానికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని ముగ్గురు సభ్యులను చండీగఢ్ పోలీసు క్రైమ్ బ్రాంచ్ తాజాగా అరెస్టు చేసింది. మే 18న చండీగఢ్‌లో బిష్ణోయ్, లక్కీ పాటియాల్ గ్యాంగ్ సభ్యులు ఉన్నట్లు క్రైం బ్రాంచ్‌కు రహస్య సమాచారం అందింది.

వర్చువల్ కమ్యూనికేషన్

నిందితులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి వర్చువల్ నంబర్లు, వివిధ మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నారని, చాలా మంది ప్రాణాలకు ముప్పు కలిగించే నేరాన్ని అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ ఉదయ్ పాల్ మాట్లాడుతూ నిందితులు చండీగఢ్‌లోని దదుమజ్రా కాలనీ నివాసి రవీందర్ సింగ్, మొహాలి నివాసి కరణ్ కపూర్, పంజాబ్‌లోని ఫజిల్కా నివాసి జావేద్ జింజాలను తాజాగా అరెస్ట్ చేశామని చెప్పారు. మే 25న రవీందర్ సింగ్, జింజా పట్టుబడ్డారు. కరణ్ కపూర్‌ను విచారించిన మరుసటి రోజు మిగతా వారిని అరెస్టు చేసినట్లు పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ ఉదయ్ పాల్ తెలిపారు. సోమవారం స్థానిక కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

- Advertisement -

Firing at Salman Khan's house: Mumbai Police declares Lawrence Bishnoi, his  brother wanted accused | India News - Times of India

నిందితుడి క్రైమ్ హిస్టరీ పెద్దదే..

అబోహర్, బటిండాకు చెందిన జింజా అనే బిష్ణోయ్ బ్యాచ్‌మేట్ అక్రమ నిధులను మేనేజ్ చేస్తూ, చండీగఢ్ పంజాబ్‌కు చెందిన యువకులను తన నెట్‌వర్క్‌లో చేరమని డబ్బును ఎరగా చూపినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్‌లలో అతనిపై ఆరు కేసులు నమోదయ్యాయి. డబ్బు వసూలు చేసేందుకు జింజా సన్నిహితుడు రవీంద్ర సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కరణ్ కపూర్ తన ఇంటి నుండి అక్రమ వలస వ్యాపారాన్ని నడుపుతున్నాడు. ఇప్పటికే చాలా మందిని విదేశాలకు పంపాడు.

ఏప్రిల్ 14న ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 14న ఆదివారం తెల్లవారుజామున బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు షూటర్లు కాల్పులు జరిపిన వెంటనే పారిపోయి గుజరాత్‌లోని భుజ్‌లోని ఒక దేవాలయంలో దాక్కున్నారు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత రెండు రోజుల్లోనే షూటర్లను కనుగొన్నారు. నిందితుల పేర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్. ఈ దాడికి బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు షూటర్లకు పిస్టల్స్ సరఫరా చేసినందుకు సోనూ చందర్, అనూజ్ థాపన్ ఇద్దరికీ పంజాబ్ పోలీసులు సంకెళ్లు వేశారు. ఈ నిందితుల్లో అనూజ్ థాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు చేసుకుని చనిపోయాడు. ఇక అనుజ్ థాపన్ ట్రక్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నాడు. అతనిపై దోపిడీ, ఆయుధ చట్టం నేరాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు