Thamannah: తమన్నా మూవీకి 8 ఏళ్ల తర్వాత మోక్షం.. డైరెక్ట్ గా అక్కడే..!

Thamannah: మిల్క్ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో ఎంత మంచి పేరు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తమన్నా ప్రధాన పాత్రలో దటీజ్ మహాలక్ష్మి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్ ఆధారంగా ఈ సినిమాని హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు . ఇందులో సిద్దు జొన్నలగడ్డ మరో కీలకపాత్ర పోషించారు. దాదాపు 8 ఏళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది .2014లో ఈ సినిమా వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. 2016లో షూటింగ్ కూడా పూర్తయింది. పోస్టర్స్ , టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ దక్షిణాది రీమేక్ హక్కుల విషయంలో వివాదాలు చుట్టుముట్టాయి . దీంతో దటీజ్ మహాలక్ష్మి సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఇకపోతే మొదట్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగినా.. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడ ఊసు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి పూర్తిగా మరిచిపోయారు.అయితే ఇప్పుడు తాజాగా దటీజ్ మహాలక్ష్మి సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నిజానికీ థియేటర్లలో విడుదల చేస్తే ఆడియన్స్ ఈ సినిమాను ఆదరిస్తారో లేదో అన్న భయంతోనే ఇప్పుడు డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి తీసుకురాబోతున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తో దటీజ్ మహాలక్ష్మి నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

గతంలో కూడా ఈ సినిమా నేరుగా ఓటీటీ లోకే వస్తుందని కామెంట్లు వినిపించాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది.కానీ అప్పుడు స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అంటున్నారు మరి ఈసారైనా ఈ సినిమాకు మోక్షం కలుగుతుందో లేదో అని చూడాలి.

- Advertisement -

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. జైలర్ సినిమాలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మరొకవైపు చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో కూడా నటించింది. 17 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ అందరిని అబ్బురపరుస్తుంది తమన్న. ఇకపోతే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ను వివాహం చేసుకోబోతోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు