Kushi: అక్కడ అన్ని మర్చిపోయి సరదాగా గడిపేస్తున్న సామ్

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తుంది. గత కొంత కాలంగా సమంత పరిస్థితి అంత బాగోలేదని తెలిసిందే. నాగ చైతన్య తో విడాకుల తీసుకున్న తర్వాత మానసికంగా చాలా వీక్ అయిపోయింది. అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న సామ్ గత సంవత్సరం యశోద మూవీతో వచ్చి హిట్ కొట్టింది. అయితే యశోద మూవీ ప్రమోషన్స్ టైమ్ లోనే సమంతకు మాయో సైటిస్ అనే వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకొని తొదరగా తదుపరి మూవీస్ చేయడం ఆరంభించింది.

రీసెంట్ గా శాకుంతలం మూవీతో ఆడియన్స్ ని పలకరించింది సామ్. అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో నిరాశలో ఉంది. ఎందుకంటే అది సామ్ మెయిన్ లీడ్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ. పైగా ఈ సినిమాకోసం సమంత చాలా కష్టపడింది. కానీ మూవీ డిజాస్టర్ అయి అందరికి షాకిచ్చింది. అయినా సమంత ధృడ సంకల్పంతో తన తదుపరి మూవీస్ పై శ్రద్ధ పెట్టింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. “నా రోజా నువ్వే” అంటూ సాగే ఈ సాంగ్ లో సామ్ మునుపటి సినిమాల కన్నా మొహంలో మంచి కళతో కనిపించింది. తాజాగా సామ్ పెట్టిన ఇన్స్టా గ్రామ్ స్టేటస్ లో ఈ సాంగ్ షూట్ లో సామ్ సందడి చేస్తున్న వీడియో పెట్టింది. ఈ వీడియోలో తన హెయిర్ డ్రెస్సర్ అయిన రోహిత్ భక్తర్ కు సమంత పిలక జుట్టు వేస్తుంది. ఇంకా అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ లోను సామ్ చాలా సరదాగా ఉన్నట్టుంది. దీంతో సమంత బాధలన్నీ మర్చిపోయి కూల్ గా ఉందని సామ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత నటిస్తున్న “ఖుషి” సినిమాలో తాను ఒక ముస్లిం అమ్మాయిగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ గా తెరకెక్కతున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 1 న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు