Samanth: సమంత తన అభిమాని కోసం ఏం చేసిందో తెలుసా

Samanth: ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సాధించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అతి తక్కువ టైంలోనే ఎక్కువ మంది స్టార్ హీరోలతో వర్క్ చేసింది సమంత. ఒక స్టార్ హీరో పక్కన ఛాన్స్ రావడం అనేది అరుదైన విషయం. అలాంటిది సమంత కెరియర్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో నటించి మంచి హిట్ సినిమాలను అందుకుంది.

మహేష్ బాబుతో దూకుడు

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును సెట్ చేసింది. మహేష్ బాబు లోని కామెడీ టైమింగ్ను పర్ఫెక్ట్ గా వాడుకొని మంచి కథను సిద్ధం చేసుకున్నాడు శ్రీను వైట్ల. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ సినిమాను శ్రీనువైట్ల ఇప్పటివరకు కూడా చేయలేకపోయాడు. మహేష్ బాబుకి ఈ సినిమాతో ఎంత మంచి పేరు వచ్చిందో సమంత కూడా అలానే మంచి పేరు వచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాల్లో బాగా వర్కౌట్ అయింది.

పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది

త్రిపుర శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అప్పటివరకు ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ కూడా ఈ సినిమా చెరుపేసింది. ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ సరసన సమంత నటించిన మంచి మార్కులను సాధించుకుంది. ఈ సినిమా తర్వాతే సమంతతో మరో రెండు సినిమాలుకు వర్క్ చేశాడు త్రివిక్రమ్.

- Advertisement -

Samantha

లేడి ఓరియంటెడ్ గా

ఇకపోతే సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని వ్యక్తిగత కారణాల వలన విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన కెరియర్ పై ఫోకస్ చేసింది సమంత. వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలో కూడా సైన్ చేయటం మొదలుపెట్టింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ, శకుంతలం, యశోద, యూటర్న్ ఇలాంటి సినిమాలతో మంచి పేరును సాధించుకుంది

సమంత ఫ్యాన్ ఫాలోయింగ్

సమంతకి ఎప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ అలానే ఉండిపోతారని చెప్పొచ్చు. మనం ఒక హీరోను గాని ఒక హీరోయిన్ గానీ ఇష్టపడ్డామంటే వాళ్ళ ఇన్స్పిరేషన్స్ లో ఏమైనా సాధించగలం. ఇదే విషయాన్ని రీసెంట్ గా ప్రూవ్ చేసింది అమ్రుష అనే అమ్మాయి. సమంతకు అతిపెద్ద అభిమాని అయిన ఈ అమ్మాయి తెలంగాణ ఎంసెట్లో మంచిర్యాంకును సాధించింది. ఈమె ర్యాంకును సాధించడంతో సమంత ఈమెకి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఒక స్టోరీని కూడా పోస్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ తన ఫ్యాన్ కోసం ఇలా చేయటం అనేది మామూలు విషయం కాదు. దీనితో సమంతకు ఫ్యాన్స్ అయిన వాళ్లంతా కూడా గర్వపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు