Samantha: సమంత ముందు పెద్ద టాస్క్.. అంగీకరిస్తుందా..?

Samantha.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత తమిళ్ , హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో భారీ విజయాలను సొంతం చేసుకున్న సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరించింది. ఇకపోతే నాగచైతన్యతో ప్రేమలో పడడం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం , అనూహ్యంగా విడాకులు అన్నీ కూడా ఈమె కెరియర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా విడాకుల సమయంలో ఎంతో నెగిటివిటీ మూట కట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Samantha: Big task ahead Samantha.. do you agree..?
Samantha: Big task ahead Samantha.. do you agree..?

జీవితంలో ఎన్నో విమర్శలు..

దీనికి తోడు మయోసైటిస్ అనే వ్యాధితో ఎంతో ఇబ్బంది పడింది. వ్యాధి నుంచి కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి కూడా దూరం అయింది.. అయినా సరే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతోంది సమంత. ఒకవైపు వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరొకవైపు తాను నటించిన యశోద, శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనింది. ఇకపోతే ఏడాది విశ్రాంతి తీసుకుని మళ్ళీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన సమంత , సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే కాంబినేషన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమంతాకు తాజాగా ఒక పెద్ద టాస్క్ వచ్చినట్లు సమాచారం.

సమంత ముందు అతిపెద్ద టాస్క్..

ఏడాది పాటూ విశ్రాంతి తీసుకున్న సమంత ఇటీవల వరుస సినిమాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాలీవుడ్ నుండి ఒక బడా హీరో సినిమాలో పెద్ద అవకాశం వచ్చిందంట. అయితే హీరోయిన్ గా కాదని సమాచారం. ముఖ్యంగా ఆ హీరోకి వదిన పాత్ర కోసం సమంతకు అవకాశం వచ్చిందట. దీంతో సమంతా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఎందుకంటే గతంలో సమంత ఆ బడా హీరోతో రొమాన్స్ చేసిందట. ఒక సినిమాలో హీరోకి హీరోయిన్గా నటించిన ఈమె ఇప్పుడు మళ్ళీ అదే హీరోకి వదినగా అంటే అభిమానులు స్వీకరిస్తారో లేదో అని, ఒకవేళ ఒకసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఒప్పుకుంటే మళ్లీ అవే పాత్రలే వస్తాయనే భయంతో సమంత ముందుగానే ఆలోచించి రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

- Advertisement -

సింపుల్గా బ్రేక్ చేసిందిగా..

అంతేకాదు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు లేకపోతే కొంతకాలం ఖాళీగానే ఉంటాను.. కాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు ఒప్పుకోను అని స్పష్టం చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా సమంత ముందు చూపుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది సమంత. మరోవైపు మలయాళంలో మమ్ముట్టి సినిమాలో అవకాశం లభించిందని వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా ఓపెనింగ్ రోజు ఆమె కనిపించలేదు.. అయితే మరి ఇందులో సమంత ఉందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది. ఏది ఏమైనా సమంతా ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ఒక పెద్ద టాస్కుని ఈమె బ్రేక్ చేసిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు