Samantha: సామ్ కు ఇష్టమైన ఇంట్లో అడుగుపెట్టబోతున్న చైతన్య

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, అక్కినేని నట వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. ఆపై విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది. డైవర్స్ అయి రెండేళ్లు గడుస్తున్న వీరి గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు కూడా వీరి గురించి ఒక వార్త ఫీల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

అక్కినేని నాగ చైతన్య ఇటీవల నూతన గృహ ప్రవేశం చేశారాట. చైతన్య గృహ ప్రవేశం చేస్తే.. సమంతకు ఏం సంబంధం అనుకుంటున్నారా ? అవునండి.. ఈ కొత్తంటికి సమంతకు సంబందం ఉంది. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత సీనియర్ నటుడు మురళి మోహన్ కు చెందిన ఒక అపార్ట్మెంట్ లో పెంట్ హౌస్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పెంట్ హౌస్ సమంత, నాగ చైతన్యకు బాగా నచ్చిందట. దీంతో నాగార్జున రికమెండేషన్ తో మురళి మోహన్ వద్ద ఆ ఇల్లు కొన్నారు. అయితే అక్కడ ఉంటునే తమ టెస్ట్ కు తగ్గట్టు లగ్జరీగా ఒక ఇల్లు కట్టుకోవాలని సామ్-నాగ్ అప్పట్లో ప్లాన్ చేసుకున్నారట. పనులు కూడా స్టార్ట్ చేశారట.

ఇద్దరు మంచి నటులే కాబట్టి ఇద్దరి డబ్బులతో ఒక ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేశారని టాక్. సమంతకు నచ్చినట్టు ఇల్లును డిజైన్ చేయించారని సమాచారం. అయితే ఈ ఇల్లు నిర్మాణం పూర్తి కాకముందే.. సామ్-నాగ్ డైవర్స్ తీసుకున్నారు. దీంతో ఇల్లు నిర్మాణ పనులు కూడా ఆగిపోయాట. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య ఆ ఇంటి పనులను దగ్గరుండి మరి స్టార్ట్ చేయించాని తెలుస్తోంది. అది ఇప్పుడు రెడీ అయిపోవడమే కాకుండా, ఆ ఇంట్లోకి నాగ చైతన్య షిఫ్ట్ కూడా అయ్యారట. దీంతో ఇండస్ట్రీలో సమంతకు నచ్చిన ఇంట్లో నాగ చైతన్య ఉండబోతున్నాడు అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అయితే డైవర్స్ తర్వాత సమంత, నాగ చైతన్య తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు తో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. అలాగే సామ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు