Samantha: పోటీ సహజం.. మరింత కష్టపడతాను – సమంత..!

Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు వారితో సినిమాలు చేస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె.. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత.. నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈమె సినిమాలకు మాత్రం బ్రేక్ ఇచ్చింది.. అయితే వివాహం చేసుకున్న తర్వాత నాగచైతన్యతో మజిలీ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకుంది.. ఇక ఈ సినిమా విడుదలైన ఏడాదికే విడాకులు తీసుకుంది ఈ జంట. వివాహమున అనంతరం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె అంతకుమించి నెగిటివ్ రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇక చివరికి వాటిని తట్టుకోలేక పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే..

ఐఎండీబీలో 13వ స్థానం..

Samantha: Competition is natural.. I will try harder - Samantha..!
Samantha: Competition is natural.. I will try harder – Samantha..!

ఇక గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చికిత్స కోసం దాదాపు ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమైంది.. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది సమంత. ఇదిలా ఉండగా తాజాగా ఐఎండిబి జాబితాను విడుదల చేయగా.. 13వ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపైనే సమంత మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించింది..

పోటీ పడడం సహజమే.. కష్టపడి పనిచేస్తా..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఇటీవల ఐఎండిబి విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనిపై తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీ ఉంటుంది అని తెలిపారు. మంచి పోటీ వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది.. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం.. ఆ సహజం ముఖ్యంగా నేను కూడా పక్కవారిని చూసే స్ఫూర్తి పొందుతూ ఉంటాను. వారి విజయాలను చూసి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని అనుకుంటాను.. నేను ఎప్పుడూ కూడా పోటీని నెగిటివ్ గా తీసుకొని ఐ ఎమ్ డి బి జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది… నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలు పెట్టినట్లు అనిపిస్తోంది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు.. ముఖ్యంగా గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి .. తప్పకుండా కష్టపడి పనిచేస్తాను అంటూ సమంత తెలిపింది.

- Advertisement -

సమంత సినిమాలు..

ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటించబోతున్నారు.. దీనికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.. తన నిర్మాణ సంస్థ “ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్” బ్యానర్ పైన రూపొందుతున్న తొలి చిత్రం కూడా ఇదే.. గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. వెబ్ సిరీస్ సిటాడెల్ : హనీ బన్నీ తో త్వరలోనే సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ , ఇందులో హీరోగా నటిస్తూ ఉండగా .. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని రూపొందిస్తున్నారు.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. మొత్తానికైతే సమంత చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు