Samantha: ఆమె టార్చర్ వల్లే బోల్డ్ గా మారిందా..?

Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత సింప్లిసిటీకీ కేరాఫ్ అడ్రస్ అనడంలో సందేహం లేదు. ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలి అనే పదానికి నిర్వచనం ఈమె… కోట్ల రూపాయల ఆస్తులున్నా సరే ఒకప్పుడు చాలా సింపుల్ గా అందరితో కలగలిసిపోయి కనిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఊహించిన విధంగా బోల్డుగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది సమంత.. మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన సమంత ఉన్నట్టుండి బోల్డ్ గా మారడం వెనుక ఒకరి హస్తం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చిపోతున్న సామ్..

Samantha: Did she become bold because of torture..?
Samantha: Did she become bold because of torture..?

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక సగంలో ఆపేసిన ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.. అలాగే ఒక మంచి కథతో రీయంట్రి ఇచ్చేందుకు కూడా సిద్ధం అయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హెల్త్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూనే బోల్డ్ షో తో రెచ్చిపోతోంది. గతంతో పోల్చుకుంటే గ్లామర్ షో మరింత పెంచేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తోంది. అసలు మనం చూసేది సమంత నేనా అన్నట్లుగా తెగించి మరీ అందాలు చూపిస్తోంది

ఆమె వల్లే బోల్డ్ గా మారిన సమంత..

అయితే ఇప్పుడు తాజాగా సమంత గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సమంత ఇంత గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అసలు కారణం ఏమిటి అంటే నాగచైతన్య, శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించిన సమంత… ఇప్పుడు ఆమెను మించి అందాలతో రెచ్చిపోవాలని ఫిక్స్ అయిందట.. అందుకే రోజు రోజుకి డ్రెస్ సైజు తగ్గించి, బోల్డ్ గ్లామర్ తో కుర్రాళ్లకు మంచి కిక్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఆమె వల్లే అందాల ఆరబోతతో మరింత రెచ్చిపోతుంది సమంత. అయితే ఈ విషయంపై తెలుగు అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఒకరిని చూసి ఇలా ఎప్పుడూ చేయదని.. ప్రస్తుతం జనరేషన్ తగ్గట్టుగా అందాలు ఆరబోస్తేనే అవకాశాలు ఉంటాయి అన్న కోణంలో ఆమె ఆలోచించి ఉంటుంది అంటూ సమంతకు మద్దతు పలుకుతున్నారు.

- Advertisement -

చైతూ తో విడాకులు అందుకేనా..

ఇక సమంత విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడం వల్లే నాగచైతన్యకు నచ్చడం లేదని.. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని.. ఆ కారణంగానే విడాకులు కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక అంతే కాదు ఎప్పటికప్పుడు వీరి విడాకులపై రకరకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎందుకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారో .. అందుకు గల సరైన కారణం మాత్రం ఒక్కటి కూడా తెలియ రాలేదు అని చెప్పవచ్చు.. ఇక ఇప్పుడు శోభిత వల్లే ఈమె బోల్డ్ గా మారిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం సమంత వరకు చేరితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు