Samantha: టాలీవుడ్‌ హీరోకు సమంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది…. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 12 ఏళ్లకు పైనే అవుతున్నా ఇప్పటికీ ఏమాత్రం తన హవా తగ్గలేదు. తన నటనకు ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.

దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా…. సమంత తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వీరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం దాదాపు కొన్ని ఏళ్లపాటు కలిసున్న ఈ జంట…. ఆ తర్వాత ఏవో కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు అనంతరం ఎవరికివారు పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు.

ఇక చైతన్య మాత్రం విడాకుల అనంతరం ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు…. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగచైతన్య కూడా చాలాసార్లు ఓ హీరోయిన్ తో కెమెరా కంటపడ్డారు. ఇక ఆ హీరోయిన్ ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన సమంత…. చైతన్య మళ్ళీ వివాహం చేసుకుంటే ఒప్పుకోనని అంటుందట. విడాకుల అనంతరం సమంత… నాగచైతన్యను మర్చిపోలేక పోతుందని…. మళ్లీ చైతన్యనే తన భర్తగా కావాలని అనుకుంటుందట.

- Advertisement -
samantha-samantha-ruth-prabhu-missed in mammootty movie launch event
Samantha

ఇక మళ్లీ వివాహం చేసుకుంటే అస్సలు ఒప్పుకోనని సమంత… నాగచైతన్యకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చేందుకు కూడా రెడీ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఇక సమంత, నాగచైతన్య అభిమానులు మళ్లీ ఈ జంట కలుసుకోవాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు