Samantha: మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్.. జోరు పెంచేసిందే..?

Samantha.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించిన సమంత ఎంతోమంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళ్ , హిందీ వంటి చిత్రాలలో కూడా నటించింది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమంత నార్త్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది కూడా వీటి ద్వారానే. ఈ వెబ్ సిరీస్ లో ఈమె నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఇందులో బోల్డ్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.

ఇంకో వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్..

Samantha: Green signal for another web series.. has the momentum increased..?
Samantha: Green signal for another web series.. has the momentum increased..?

రాజ్ అండ్ డీకే సంయుక్తంగా ది ఫ్యామిలీ మెన్ ఫ్రాంచైజ్ లో సమంత నటించింది. ఈ వెబ్ సిరీస్ అయిపోయిన వెంటనే ఇదే దర్శకులతో సమంత సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లుగా సమాచారం. ఇలాంటి సమయంలోనే సమంత మళ్ళీ ది ఫ్యామిలీ మెన్ ఫ్రాంచైజ్ లో కూడా భాగం కావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాజ్ అండ్ డీకే వీటి కంటే ముందుగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను సైతం అనౌన్స్మెంట్ చేశారు.

రక్తబీజ్ టైటిల్ తో వెబ్ సిరీస్..

రక్తబీజ్ టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ని తీయబోతున్నారు.. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ మెయిన్ పాత్రలో నటిస్తూ ఉండగా.. సమంత ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈమె పాత్రకు సంబంధించి ఎటువంటి విషయం ఇంకా చిత్ర బృందం తెలియజేయలేదు. ఇలా వరుస పెట్టి సమంత వెబ్ సిరీస్ ల ద్వారానే బాలీవుడ్ లో తన మార్కెట్ ను మరింత పెంచుకునేలా విస్తృత ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే నెమ్మదిగా పలు హిందీ సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది సమంత.

- Advertisement -

ఆదిత్య రాయ్ కపూర్ సినిమాలు..

ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఇది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ తో మొదటిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. రక్తబీజ్ అనేది కూడా సెకండ్ వెబ్ సిరీస్ కావడం గమనార్హం. గత ఏడాది గుమ్రా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రస్తుతం మెట్రో అనే సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం.

సమంత సినిమాలు..

సమంత కూడా మరొకవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ ని పూర్తి చేసిన తర్వాత తన ప్రొడక్షన్ హౌస్ లోనే బంగారం అనే చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులలో కూడా నటిస్తూ సమంత చర్చనీయాంశంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సమంత హీరోయిన్ గా సరైన కథతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు