Samantha : ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్యా… ఆ ముసలాడితో సమంత రొమాన్స్ ఏంటి ?

Samantha.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీకి లోకి అడుగుపెట్టిన ఈమె.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడమే కాదు స్టార్ హీరోలు అందరీ సరసన నటించి మెప్పించింది. ఇకపోతే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి హనీ బన్నీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ..ఒక ముసలాడితో రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది సమంత అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం.

ముసలాడితో రొమాన్స్ కి సిద్ధం..

Samantha: I didn't expect it... What is Samantha's romance with that old man?
Samantha: I didn’t expect it… What is Samantha’s romance with that old man?

తాజాగా సమంత బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో.. యాక్షన్ అడ్వెంచర్ దేశభక్తి కలిగిన మూవీలో నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.. కానీ వీరిద్దరూ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం సమంతకు ఆనందాన్ని కలిగించినా ఆమె అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. యంగ్ స్టర్స్ తో సినిమా చేసే ఈమె ఇప్పుడు ముసలాడితో రొమాన్స్ చేయడం ఏంటి..? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

21 యేళ్లు తేడా.

అసలు విషయంలోకెళితే షారుఖ్ ఖాన్ వయసు 58.. సమంత వయసు 37.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ సుమారుగా 21 సంవత్సరాలు.. ఇప్పుడు సమంత షారుఖ్ ఖాన్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుండడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారని చెప్పాలి. ఇకపోతే జవాన్ సినిమాలో నయనతార కంటే ముందే హీరోయిన్ గా సమంతకు అవకాశం వచ్చింది.. కానీ సమంత కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.. అయితే ఎట్టకేలకు ఇప్పుడు షారుక్ ఖాన్ తో మళ్ళీ జతకట్టబోతోంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

సమంత డ్రీమ్ నెరవేరబోతోందా..

ఇకపోతే షారుఖ్ ఖాన్ కి సమంత పెద్ద వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించి.. తన కలను నెరవేర్చుకున్న ఈమె షారుఖ్ ఖాన్ తో కూడా ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.. మొత్తానికి అయితే ఈ ముగ్గురితో కలిసి నటించాలనుకున్న సమంత కోరిక ఇప్పుడు షారుక్ ఖాన్ తో తీరబోతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా తనకంటే వయసులో 21 సంవత్సరాలు పెద్దవాడైన హీరోతో ఈమె సినిమా చేయడానికి ఒప్పుకోవడంపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. మరి సమంత డ్రీమ్ కాబట్టి.. దీనిపై ఈమె ఖచ్చితంగా స్పందిస్తుందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు