Samantha: సమంతకు కొత్త కష్టాలు..అక్కినేని ఫ్యామిలీ మళ్లీ షురూ చేసిందా ?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత సినిమా వచ్చిందంటే చాలు తన అభిమానులు ఎంతో ఆతృతగా సినిమాలు చూస్తూ ఉంటారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటన, అందం, అమాయకత్వం, చలాకితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. తాను నటించిన మొదటి సినిమాతోనే కోట్లాది సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా నిలిచింది. దాదాపు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగిస్తూనే ఉంది.

ఇక సమంత ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ సినిమాలో జెస్సీ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆ సినిమా అనంతరం స్టార్ హీరోల నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్గా చేసింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అతితక్కువ సమయంలోనే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక కొన్నేళ్ల తర్వాత వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించుకొని మరి వివాహం చేసుకున్నారు. ఇక వివాహా అనంతరం వారి దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు.

Samantha: Because of that hero.. Samantha's marital relationship is ruined..?

- Advertisement -

ఇక నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం సమంత సినిమాలపరంగా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యానికి కూడా గురైంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి తీవ్రంగా బాధపడింది. ఆ తర్వాత ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా…..ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలుస్తారని ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు.

కానీ అది జరిగే పని కాదంటూ అక్కినేని కుటుంబం తేల్చిచెప్పేసేందట. ఇన్ని రోజులు అక్కినేని కుటుంబసభ్యులు సమంత, నాగచైతన్య కలుస్తారని ఎంతో ఆశతో సమంతకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను వారి ఇంట్లో అలానే ఉంచుకున్నారట. ఇక వీరు కలవరని తెలుసుకొని సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను వారి ఇంట్లో నుంచి బయటపడేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు