Samantha: టాలీవుడ్‌ హీరోయిన్‌ ను ఆ విషయంలో సమంత ఇబ్బంది పెట్టిందా ?

 

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన హవాను కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలు లేకుండా స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. “ఏ మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన నటించి ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది.

ఇక ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే నాగచైతన్యతో ఈ బ్యూటీ ప్రేమలో పడింది. అప్పటినుంచి వారిద్దరూ రహస్యంగా వారి ప్రేమను కొనసాగించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలపై వారు స్పందించలేదు. కొన్నేళ్లపాటు వీరు రహస్యంగా వారి ప్రేమను కొనసాగించి ఆ తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం వీరు చాలా సంతోషంగా వారీ లైఫ్ ను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సమంత ప్రతిరోజూ చైతన్యను కాస్త ఇబ్బంది పెట్టేదట. ప్రతిరోజు రాత్రి ఐస్ క్రీమ్ ఎక్కువగా కావాలని గొడవ చేసేదట. కానీ చైతన్య వద్దని చెప్పేవాడట.

- Advertisement -

రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటే జలుబు అవుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరుగుతుంది అని చెప్పేవారట. అయినా కూడా సమంత వినకుండా ఐస్ క్రీమ్ కావాలని ప్రతి రోజు గొడవ చేసేదట. ఇదిలా ఉండగా…. వీరిద్దరూ అతి తక్కువ కాలంలోనే విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. కానీ ఏవో అనివార్య కారణాలతో విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి సమంత కొన్ని రోజులపాటు చికిత్స తీసుకుంది.

సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి తన హెల్త్ మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత పూర్తిగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో రాణించేందుకు సిద్ధంగా ఉంది. ఇక చైతన్య విషయానికి వస్తే…. విడాకుల అనంతరం చైతన్య ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. అయినప్పటికీ వరుస సినిమాలతో చైతన్య బిజీగా ఉన్నారు. ఏది ఏమైనాప్పటికీ వీరిద్దరూ మళ్ళీ కలుసుకోవాలని తన అభిమానులు ఇప్పటికీ కోరుకొంటూనే ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు