Samantha: అక్కినేని ఫ్యామిలీపై సమంత కొత్త అస్త్రం..?

Samantha: అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నాగచైతన్య గురించి పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న నాగచైతన్య ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటే సక్సెస్ అయ్యాడు. ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఒకప్పుడు యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి పరిచయంలోని వీరిద్దరూ మంచి స్నేహితురాలు అయ్యారు ఆ స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది.

కొద్దిరోజుల పాటు సీక్రెట్ గా వీరి లవ్ రిలేషన్ కొనసాగించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగింది. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏవో కారణాలతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య, శోభిత దూళిపాళ్లతో లవ్ రిలేషన్ కొనసాగించాడు. కొన్నేళ్లపాటు సీక్రెట్ గా వీరి రిలేషన్ కొనసాగించిన ఈ జంట ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

Naga Chaitanya is engaged to Samantha's sister..?
Samantha

ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకున్న తర్వాత సమంత నాగచైతన్య మీద రివేంజ్ తో సమంత కూడా వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిందట. ఇన్ని రోజులు పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు సమంతను వివాహం చేసుకోమని ఎంతగానో ఒప్పించారట. కానీ సమంత వివాహం చేసుకోకుండా… వేరే వారితో రిలేషన్ పెట్టుకోకుండా సింగిల్గానే ఉంది. ఇక ఇప్పుడు సమంత వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి తన కుటుంబసభ్యులతో మంచి సంబంధాలు చూడమని చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి సమంత కుటుంబసభ్యులు, తన అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు