Samantha: ఆ తెలుగు హీరో కారణంగా సమంత కొంప మునిగిందా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. దాదాపు ఆగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇక తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ.

ఇక సీక్రెట్ గా వీళ్ళ లవ్ కొనసాగించిన ఈ జంట కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక అతి తక్కువ సమయంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు వీరిద్దరూ. ఇదిలా ఉండగా…. సమంత ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. కానీ టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ తో కలిసి జాను సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని ముందుగా దిల్ రాజు…. నాగచైతన్య, సమంతతో కలిసి తీయాలని అనుకున్నారట.

ఈ సినిమా కథని చైతన్యకు చెప్పేసరికి స్టోరీ నచ్చకపోవడంతో చేయను అని చెప్పాడట. కానీ సమంత మాత్రం వినకుండా ఆ సినిమాను చేసిందట. ఇక ఆ సినిమాలో శర్వానంద్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు. చైతు సినిమా వద్దని చాలా చెప్పాడట. కానీ అసలు మాట వినకుండా సమంత ఆ సినిమాను చేసింది. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే తాను చెప్పిన మాట వినకుండా ఆ సినిమా సమంత చేసిందని….. కోపంతో చైతన్య బాధపడ్డాడట.

- Advertisement -

Samantha: Because of that hero.. Samantha's marital relationship is ruined..?

ఇక ఈ సినిమా కారణంగానే నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. వారి విడాకులకు ఈ సినిమానే ఓ కారణం అంటూ ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి చాలామంది నెటిజెన్లు బాధపడుతున్నారు. ఈ సినిమా సమంత చేసి ఉండకపోతే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు