Samantha: తన ఆరోగ్యం పై సమంత షాకింగ్ నిర్ణయం ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు తన హవాను కొనసాగించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది.

కోనేళ్లపాటు వీరిద్దరూ వారి వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడిపారు. నాలుగేళ్ల తర్వాత ఏవో కొన్ని అనివార్య కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం ఇద్దరు వారి పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు. కానీ వారిద్దరికీ సక్సెస్ మాత్రం పెద్దగా రాలేదు. విడాకుల అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే.

Samantha Latest photoshoots viral on social media

- Advertisement -

కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత కేవలం ఇంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటుందట. బయటి ఆహారం తినడం పూర్తిగా మానేసి చాలా నేచురల్ గా ఇంట్లోనే వంటకాలను తయారు చేయించుకొని తింటుందట.

అంతేకాకుండా తన ఇంట్లోనే ఎలాంటి మందులు వాడకుండా కూరగాయలను పండించుకుని వాటిని తింటుందని తెలుస్తోంది. అంతేకాకుండా చాలా రకాల వ్యాయామాలు కూడా చేస్తు తన ఆరోగ్యం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు