Samantha : మరోసారి సమంత అందాల రచ్చ… కవర్ పేజీపై రెచ్చిపోయి ఫోజులు

Samantha : సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపుగా సంవత్సరం దాటిపోయినప్పటికీ సౌత్ లో ఇంకా నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఆరోగ్య సమస్యల కారణంగా ఈమె నటించిన సినిమాలు చాలా కాలంగా థియేటర్లలోకి రాకపోయినప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత తిరిగి సినిమాలకు గ్రీస్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్ హాట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతోంది.

Image

సమంతా ఫోటోలు వైరల్

గతంతో పోలిస్తే సమంత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. అలాగే గతంలో ఎన్నడూ లేనివిధంగా అందాల ఆరబోత విషయంలో రెచ్చిపోతుంది. బోల్డ్ షో తో క్లీవేజ్ ఫోటోషూట్, థై హై స్లిట్ డ్రెస్ లలో కూడా కిల్లింగ్ ఫోజులిచ్చి తన ఫాలోవర్స్ మతిపోగొడుతోంది. తాజాగా సమంత మరోసారి మ్యాగజైన్ ఫోటోషూట్ కవర్ కి ఇచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో సమంత బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఓపెన్ బ్లేజర్ లో హాట్ గా కనిపిస్తున్న సమంత ఫోటోలు ప్రస్తుతం వైరులవుతున్నాయి.

- Advertisement -

Image

కాగా ఇందులో సమంత మినిమల్ మేకప్ వేసుకోగా, బ్లేజర్ పై భారీ నగలు ఉన్నట్టుగా డిజైన్ ని క్రియేట్ చేశారు. అయితే సమంత ధరించిన సూట్ బ్లాక్ కలర్ లో ఉండడంతో దానిపై ఉన్న నెక్లెస్ డిజైన్ హైలెట్ గా కనిపిస్తోంది. కాగా ఇదంతా సమంత ఎల్లి అనే మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం చేసింది. సమంత స్టన్నింగ్ లుక్ ను చూసి స్టార్ హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సమంత పోస్ట్ చేసిన ఇతర ఫోటోల హాట్ ట్రీట్ పై తమన్నా స్పందిస్తూ స్టన్నింగ్ అని కామెంట్ చేసింది. మరోవైపు కీర్తి సురేష్ కూడా కిల్లర్ అంటూ కామెంట్ చేయగా, ప్రియాంక జువాల్కర్, రుహాని శర్మ హాటెస్ట్ అంటూ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇలా ఆమె పోస్ట్ చేసే ఫోటోలు పై హీరోయిన్లు కూడా కామెంట్ చేస్తున్నారంటే సమంత ఫ్యాషన్ సెన్స్ కి మెచ్చుకొని తీరాల్సిందే. మరోవైపు ఇదంతా ఆమె నాగ చైతన్య మీద కోపంతోనే చేస్తోందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఏదైతేనేం మొత్తానికి సామ్ బోల్డ్ గ్లామర్ లుక్ లో ఫోటోలను పోజులిచ్చి కుర్రాళ్ళకు మాత్రం మంచి కిక్ ఇస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు